కాసుల కక్కుర్తితో..
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:36 AM
సాయంత్రమైతే చాలు బజ్జీల బళ్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ ఐటమ్‌ల హోటల్స్, బళ్లు జనంతో కిటకిటలాడ తాయి. ఎంతో రుచిగా, స్పైసీగా తయారు చేసే ఈ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. కాని, వీటి తయారీ కి ఉపయోగించే పదార్థాలపై ఎవరికీ దృష్టి ఉండదు. కాని,
తక్కువ ధరకు తోపుడు బళ్ల వ్యాపారులకు విక్రయాలు
బజ్జీలు, ఫ్రైడ్ రైస్, నాన్‌వెజ్ వంటకాలకు వినియోగం
జంగారెడ్డిగూడెం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు సరఫరా
ఏలూరులో రెండుచోట్ల విజిలెన్స్ దాడులు.. 350 కేజీలు స్వాధీనం
జనం ఆరోగ్యంతో ఆటలు
సాయంత్రమైతే చాలు బజ్జీల బళ్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, నాన్ వెజ్ ఐటమ్‌ల హోటల్స్, బళ్లు జనంతో కిటకిటలాడ తాయి. ఎంతో రుచిగా, స్పైసీగా తయారు చేసే ఈ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారు. కాని, వీటి తయారీ కి ఉపయోగించే పదార్థాలపై ఎవరికీ దృష్టి ఉండదు. కాని, షాకింగ్ విషయం ఏమిటంటే ఏలూరులో జంతువుల కళేబ రాలతో తయారు చేసే ఈ నూనెలను పలువురు వ్యాపా రులు వీటికి వినియోగిస్తు న్నట్టు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడింది.
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి):జిల్లా కేంద్రమైన ఏలూరు నగరాన్ని కేంద్రంగా చేసకుని కొంత మంది జంతు కళేబరాలతో నూనెను తయారు చేస్తూ చిరు వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఆ వ్యాపారులు ఈ నూనెలతోనే నూడిల్స్, ఫ్రైడ్‌రైస్, ఇతర నాన్‌వెజ్ వంటకాల్లో ఉపయోగించడంతో ఒక వైపు రుచి ఉందంటూ స్ర్టీట్ ఫుడ్ తినే ప్రియులు ముచ్చటగా కడుపునిండా లాగించేస్తున్నారు. దీంతో జంతు కళేబరాలతో నూనె తయారు చేసే వ్యాపారులు, బడ్లపై నూడిల్స్, ఫ్రైడ్‌రైస్ చేసే వారి వ్యాపారులు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నా రు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ నూనెల వ్యవహారంపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్సు ఎస్పీ కె నాగేశ్వరరావుకు సమా చారం అందింది. దీంతో ఆయన ఆదేశాల మేరకు విజిలెన్సు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు పర్యవేక్షణ లో సీఐలు గంగాభవానీ, ప్రసాద్‌కుమార్, ఎస్‌ఐ నాగరాజు, కానిస్టేబుల్ దుర్గారావు, సిబ్బంది కలిసి ఏలూరులో రెండు కల్తీ నూనె తయారు చేసే రెండు స్థావరాలపై మంగళవారం మధ్యాహ్నం దాడి చేసి సంచలన విషయాలను బట్టబయలు చేశారు. ఏలూరు లంకపేటకు చెందిన బయ్యా రపు వీరకాంతం ఏలూరు పెద్ద మార్కెట్లో గొడ్డు మాంసం విక్రయిస్తాడు. అతని ఇంటి వద్ద కల్తీ నూనె తయారీ కేంద్రంగా చేసుకున్నాడు. జంతు కళేబరాల నుంచి కొన్ని కొవ్వు పదార్ధాలు, ఇతర భాగాలను తీసి వాటిని ఎండబెట్టి ఆ తర్వాత మూకుడులో పెట్టి కరగదీయించి 15 లీటర్ల డబ్బా ల్లో భద్రపరుస్తున్నారు. ఆ తర్వాత వీటిని చిరు వ్యాపారులకు, తోపుడు బళ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ నకిలీ ఆయిల్ జిల్లాలోని జంగారెడ్డిగూడెం, రాజమండ్రి తదితర ప్రాంతాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అతనిని అరెస్టు చేసి 165 కేజీల కల్తీ నూనెను, నూనె తయారీకి ఉపయోగించే జంతు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆదివారపుపేట చినమార్కెట్ ఎదురుగా తోళ్ల వ్యాపారం చేసే షేక్ సౌకత్ ఇంటి వద్ద జంతు కళేబరాలతో ఆయిల్ తయారు చేస్తుండగా విజిలెన్సు అధికారులు దాడి చేసి 185 కేజీల నూనెను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల్లో విజిలెన్సు అధికారులతోపాటు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నం, ఏలూరు ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ కె.రామరాజు పాల్గొన్నారు.