Share News

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు..!

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:27 AM

ఇటీవల కల్తీ నెయ్యి వివాదంలో ఆ పార్టీ నేతల డొల్లతనం, అక్రమాలు బయటపడడంతో.. అక్కసు వెల్లగక్కేందుకు కూటమి నేతలను రెచ్చ గొట్టేలా పార్టీ మండల, నియోజకవర్గ నేతలతో కయ్యానికి కాలు దువ్వేలా వైసీపీ చర్యలకు దిగుతోంది.

వైసీపీ ట్రాప్‌లో పడొద్దు..!

సంయమనం పాటించాలంటూ శ్రేణులకు టీడీపీ అధిష్ఠానం సూచన

ఏలూరు జిల్లాలో కోవర్టులు.. వైసీపీ వారికే పనులు

గగ్గోలు పెడుతున్న టీడీపీ శ్రేణులు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

ఇటీవల కల్తీ నెయ్యి వివాదంలో ఆ పార్టీ నేతల డొల్లతనం, అక్రమాలు బయటపడడంతో.. అక్కసు వెల్లగక్కేందుకు కూటమి నేతలను రెచ్చ గొట్టేలా పార్టీ మండల, నియోజకవర్గ నేతలతో కయ్యానికి కాలు దువ్వేలా వైసీపీ చర్యలకు దిగుతోంది. ఈ నేప థ్యంలో సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అప్ర మత్తమయ్యారు. ఈ మేరకు శ్రేణులకు దిశా నిర్దేశం చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అఽధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కీలకనేతలు అచ్చెన్నాయుడు తదితరులు ఇటీవల పార్టీ కేడర్‌, ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వైసీపీ హయాంలో చట్టాలను చేతుల్లోకి తీసు కుని ఆ పార్టీ ఎలా అధికారం కోల్పోయిందో ? గుర్తెరిగి టీడీపీ నేతలు తగిన జాగ్త్రత్తలను తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ‘సోషల్‌ మీడియాలో వచ్చే కథనాలపై స్పందించ వద్దు.. ఇతర ఆందోళనలపై స్పందించవద్దు.. గొడవలకు దిగొద్దని.. ఏ విషయంలోనై నా ప్రజా స్వామ్యబద్ధంగా వ్యవ హరించాల’ని సూచనలు చేశారు. మరోవైపు వైసీపీ శ్రేణులతో అంటకాగుతున్న నాయకులు, కార్యకర్తలపై నిఘా పెట్టారు.

ప్రతిపక్ష నేతలే కాంట్రాక్టర్లు

పోలవరం, ఏలూరు, ఉంగుటూరు, నూజివీడు, చింతలపూడి నియోజక వర్గాల్లో కాంట్రాక్టర్ల అవతారంలో ప్రతిపక్ష నేతలే కూటమితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలున్నాయి. పలుచోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు ముడుపుల ముసుగులో పాత వాసనలను వదులుకోలేక.. పర్సంటేజీల కోసం వారికే తెరవెనుక పనులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వున్నాయి. బియ్యం మాఫియాను ప్రోత్సహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధినేత పల్లా సూచనలు, హెచ్చరికలను పాటించకపోతే.. ఇంటి గుట్టు వైసీపీ ఇచ్చినట్లవుతుందని నేతలు, సీనియర్‌ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు.

కోవర్టులపై చింతమనేని హెచ్చరికలు

తన నియోజకవర్గంలో పార్టీలో కోవర్టులు కలిసిపోయి పనిచేస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రతి సమావేశంలో నొక్కి చెబుతున్నారు. ‘నా నియోజవర్గానికి ఇప్పటికే పాకింది.. మీ నియోజక వర్గాల్లోనూ అదే జరుగుతుంది చూసుకోండి’ అంటూ ఇటీవల పార్టీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో గొంతెత్తారు. ఇటీవల వరుసగా ఆరు నెలల వ్యవధిలో ఈ వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఆయన పరిధిలోని మండలాల్లో ఒక కన్నేసి ఉంచుతున్నారు. పార్టీ అధిష్ఠానం అన్ని ఆలోచించి ఆహ్వానించడంతోనే ఇతర పార్టీల నుంచి కూటమిలోకి వస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి సర్ది చెబుతున్నా.. కొన్ని నియోజకవర్గాల్లో కిందిస్థాయిలో వైసీపీ దూకుడు పెంచడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌ కార్యకర్తలకు విలువ ఉండడం లేదని.. నిన్న, మొన్న వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతలు పెరిగిపోతున్నాయని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:27 AM