Share News

తృటిలో తప్పిన ముప్పు

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:31 AM

చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామం వద్ద గురువారం ఉదయం ప్రైవేటు స్కూల్‌ బస్సు రోడ్డు పక్క కందకంలోకి దూసుకెళ్లి, ఓ పక్కకు ఒరిగిన ఘటనలో 8 మంది వి ద్యార్థులకు స్వల్ప గాయాలయ్యా యి.

తృటిలో తప్పిన ముప్పు
కందకంలోకి దూసుకెళ్లిన ప్రైవేటు స్కూల్‌ బస్సు

అంతా క్షేమం.. ఊపిరిపీల్చుకున్న తల్లిదండ్రులు

చాట్రాయి, ఫిబ్రవరి 5(ఆంధ్ర జ్యోతి): చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామం వద్ద గురువారం ఉదయం ప్రైవేటు స్కూల్‌ బస్సు రోడ్డు పక్క కందకంలోకి దూసుకెళ్లి, ఓ పక్కకు ఒరిగిన ఘటనలో 8 మంది వి ద్యార్థులకు స్వల్ప గాయాలయ్యా యి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ఉండగా, డ్రైవర్‌ బస్సు వదిలి పారిపోయాడు. వెంటనే చుట్టు పక్కల పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు వచ్చి బస్సు అద్దాలు బద్దలు కొట్టి విద్యార్థులను బయటకు తీసి కాపాడారు. రోడ్డు పక్కన ఉన్న తాటి మొద్దులు అడ్డుపడి బస్సును బోల్తా పడకుండా ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాద సమాచారం తెలిసి ఆందోళనతో బస్సు వద్దకు పరుగు పరుగున వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గ్రామస్థులు విద్యార్థులు స్వల్ప గా యాలతో బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన విద్యార్థులను విస్నన్నపేట ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. నలుగురు విద్యార్థులు నొప్పులతో బాధపడుతుండటంతో వైద్య పరీక్షల కోసం స్కూల్‌ యాజమాన్యం విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట సిద్ధార్ధ స్కూల్‌ బస్సు ప్రతి రోజు ఉదయం మండలంలోని పోలవరం నుంచి మర్లపాలెం, టి.గుడిపాడు, తుమ్మగూడెం, చిత్తపూరు, కొండపర్వ మీదుగా విద్యార్థులను తీసుకెళ్తోంది. రోజు వచ్చే డ్రైవర్‌ సెలవు పెట్టడంతో స్కూల్‌ యాజమాన్యం మరో డ్రైవర్‌ను పంపారు. బస్సు టి.గుడిపాడు దాటిన తరువాత ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్ళి ప్రమాదానికి గురైంది. ఎస్సై డి.రామకృష్ణ, వీఆర్వో వినోద్‌, రవాణాశాఖ అధికారులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేరించారు. ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సును ఎక్స్‌కవేటర్‌తో బయటకు తీసి చాట్రాయి పోలీస్టేషన్‌కు తరలించారు.

బస్సు ప్రమాదాల నివారణకు నిబంధనలు : ఎంపీ

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): తరచూ జరుగుతున్న బస్సు ప్రమాదాలపై ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విష యమై పార్లమెంట్‌లో మహేశ్‌ కుమార్‌ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరీ సమాధానమిస్తూ బస్సు ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు.మోటారు వాహనాల నిబంధనల ప్రకారం బస్సుల్లో నిర్థిష్ట ప్రమాణాలు కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ వాహ నానికి పిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉండాలన్నారు అనంతరం రెండేళ్లకు ఒకసారి ఫిట్‌నెట్‌ పరీక్షలు తప్పనిసరన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు ఎక్సిట్‌, ఎమర్జెన్సీ డోర్లు ఉండాలన్నారు. మహిళలు, చిన్నపిల్లల భద్రతకు ఏర్పాట్లు ఉండాలన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:32 AM