ఏడు బార్లకు లాటరీ.. కేటాయింపు
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:26 AM
జిల్లాలో ఎట్టకేలకు ఖాళీగా ఉన్న ఏలూరు, జంగారెడ్డిగూడెం ల్లోని ఏడు బార్లు భర్తీ అయ్యాయి.
ఏలూరు,ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఎట్టకేలకు ఖాళీగా ఉన్న ఏలూరు, జంగారెడ్డిగూడెం ల్లోని ఏడు బార్లు భర్తీ అయ్యాయి. గత నెల 28న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, గడువు ముగిసిన బుధవారం నాటికి ఏలూరు లో ఆరు బార్లకు, జంగా రెడ్డిగూడెంలో ఒక బార్‌కు నలుగురేసి చొప్పున దర ఖాస్తులు చేసుకున్నారు. ఏలూరు కలెక్టరేట్‌లో ఎక్సైజ్ అధికారుల సమక్షంలో గురువారం కలెక్టర్ వెట్రిసెల్వి లాటరీ తీసి లైసెన్సుదారులకు షాపులను కేటాయిం చారు. జిల్లా ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో 2026–28 మూడేళ్లకు సంబంధించి నిబంధనల మేరకు పారదర్శకంగా కేటాయింపు జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, సూపరింటెండెంట్ ఆనాల ఆవులయ్య, సీఐలు కృష్ణ ధనరాజ్, శ్రీనుబాబు పాల్గొన్నారు.