ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు, సామగ్రి ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టిముట్టే ఉన్నాయి. జిల్లాలో గతంలో స్టేషన్ల వద్ద మందుగుండు సామాగ్రి వల్ల జరిగిన ప్రమాద ఘటనలున్నాయి.
నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రెండు నెలల క్రితం వెండి పెరుగుదల చూసి కేజీ రూ.1.50 లక్షల చొప్పున ఐదు కేజీలు కొనుగోలు చేశాడు. ధర రూ.1.85 లక్షలకు వెళ్లినా అమ్మలేదు. ఇంకా పెరుగుతుందన్న ఆశతో ఎదురు చూశాడు.
ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద గురు వారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని పాలవ్యాన్ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
జిల్లా జలవనరులశాఖ సర్కిల్ పరిధిలో కాల్వలు, డ్రెయిన్ల బాగుచేతకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని పనులు పురోగతిలో ఉండగా, వేసవి ప్రారంభం అయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయను న్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో పాఠశాల ల్లో పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించని ముసునూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మను కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మోటారు వాహనాల తనిఖీ అధికారు లు విద్యా సంస్థల బస్సులను తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ చెప్పారు.
దొంగతనానికి గురై, చేజార్చుకున్న రూ.18 లక్షల 90 వేల విలువైన 126 సెల్ఫోన్లను జిల్లా ఎస్పీ అద్నా న్ నయీం అస్మి బాధితులకు అందజేశారు. 11వ విడత సెల్ఫోన్ల రికవరీలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడా రు. విడతల వారీగా ఇప్పటి వరకు సుమారు రూ.2 కోట్ల 60 లక్షల విలువైన 1,738 సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించాం.
జిల్లాలోని సహకార సంఘాలకు రెండు ఖరీఫ్ సీజన్ల కమీషన్ రూ.5.99 కోట్లు జమ య్యాయి. రబీకి సంబంధించి మరో రూ.4 కోట్లు విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో 80 శాతం జిల్లా సహకార బ్యాంకులోను, 20 శాతం సొసైటీలకు జమ అవుతున్నాయి. ఇటువంటి దుస్థితి ఒక్క పశ్చిమలోనే ఏర్పడింది.
గ్రామాల్లో అనధికార లే అవుట్లపై పంచాయతీరాజ్ శాఖ కొరఢా ఝుళిపించ నుంది. అత్యధికంగా పట్టణాలను ఆనుకుని వున్న పంచాయతీల్లో ఇవి ఇబ్బడి ముబ్బడిగా వెలిసినట్లు గుర్తించింది. జిల్లా ప్రధాన రహదారులకు ఆనుకుని వున్న మేజర్ పంచాయతీల్లోని వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు అనధికారిక లే అవుట్లుగా మార్చే స్తున్నారు
ఖరీఫ్ సీజన్కు సంబంధిం చి ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈసారి విశేషమేమి టంటే ఇప్పటివరకు జిల్లాలో 290 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 3,550 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి పూర్తిస్థాయిలో రూ.ఆరు కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.