Share News

ఏలూరు జిల్లాలో గురుకుల విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:37 PM

ఏలూరు జిల్లాలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గురుకుల పాఠశాలలో టెన్త్ చదవుతున్న అజిత్.. హాస్టల్ గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఏలూరు జిల్లాలో గురుకుల విద్యార్థి ఆత్మహత్య
Student Suicide

ఏలూరు జిల్లా, ఫిబ్రవరి 7: పెదవేగి గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈపిచర్ల అజిత్ అనే స్టూడెంట్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఎవరూలేని సమయంలో అజిత్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. వెంటనే విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపై విద్యార్థి మృతి సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.


ముఖ్యంగా.. తన కొడుకు మరణానికి టీచర్లు, హాస్టల్ సిబ్బందే కారణమని అజిత్ తండ్రి రమేశ్ ఆరోపించారు. మరోవైపు పదో తరగతి పరీక్షల ఒత్తిడి, పరీక్షల భయం వల్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి...

పోలీసుల సూచనలు బేఖాతరు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు

ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోసిన ప్రియుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 01:47 PM