Share News

ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోసిన ప్రియుడు

ABN , Publish Date - Feb 07 , 2026 | 10:47 AM

విజయవాడలో ప్రియురాలి పట్ల ప్రియుడు దారుణంగా ప్రవర్తించాడు. ఆమెపై అనుమానం పెంచుకున్న అతడు.. ఏకంగా ఆమె ప్రాణాలు తీసేందుకు తెగబడ్డాడు.

ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోసిన ప్రియుడు
Vijayawada

విజయవాడ, ఫిబ్రవరి 7: విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌లో దారుణం జరిగింది. ప్రియురాలిపై అనుమానం పెంచుకున్న ప్రియుడు.. ఆమె నోట్లో పురుగుల మందు పోశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రస్తుతం.. బాధిత యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ఆ యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భవానీ శంకర్ అనే వ్యక్తి.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో అతడు.. ఆమె భర్తకు అనుమానాలు కలిగేలా గొడవలు సృష్టించాడు. దీంతో సదరు యువతి భర్తకు దూరంగా ఉంటోంది.


ఈ క్రమంలో యువతిని ‘పెళ్లి చేసుకుంటాను’ అని నమ్మించి తన గదికి తీసుకొచ్చాడు భవానీ శంకర్. అక్కడ ఆమె మహేశ్ అనే వ్యక్తితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఈ విషయంపై ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఊగిపోయిన శంకర్.. యువతి నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు. ఆ తర్వాత అతనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు భవానీ శంకర్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..

పోలీసుల సూచనలు బేఖాతరు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 11:50 AM