Share News

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే..

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:00 AM

నూజివీడు సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిం చాలని, ప్రజా సమస్యల పరిష్కా రంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపి స్తా మని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను హెచ్చ రించారు.

సమస్యల  పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే..

నూజివీడు టౌన్‌, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి):నూజివీడు సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిం చాలని, ప్రజా సమస్యల పరిష్కా రంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపి స్తా మని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను హెచ్చ రించారు. నూజివీడు మునిసిపల్‌ బడ్జెట్‌ సమావేశం శుక్రవారం చైర్‌పర్సన్‌ రామిశెట్టి త్రివేణి దుర్గ అధ్యక్షతన నిర్వహించారు. కోఆప్షన్‌ సభ్యుడి హోదాలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ విజయవాడ నుంచి నూజివీడు తాగునీటి అవసరాలకు చేపట్టిన కృష్ణా జలాల తరలింపునకు సంబంధించి విద్యుత్‌ బకా యిలు రూ.16 కోట్లు పేరుకుపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, యూనిట్‌ ఏడున్నర రూపాయలతో కొనుగోలు చేసే బదులు విద్యుత్‌ భారాన్ని తగ్గించు కునేలా సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు దృష్టి సారించాలన్నా రు. పోలవరం కాల్వ నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ విధానంలో నూజివీడుకు తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు చేపడతామన్నారు. పట్టణంలో మునిసి పల్‌ స్థలాల ఆక్రమణలు తొలగించి కాంప్లెక్స్‌లు నిర్మించి ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. కాగా బడ్జెట్‌ సమావేశంపై కేవలం ఒక రోజు ముందు సమాచారం ఇవ్వడంపై వైసీపీ సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తపరి చారు. దీంతో మంత్రి సూచనల మేరకు త్వరలో కౌన్సిల్‌ తిరిగి సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. వైస్‌ చైర్మన్‌ పగడాల సత్యనారాయణ, రామిశెట్టి మురళి, కమిషనర్‌ పీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 01:00 AM