Share News

పోలీస్‌ స్టేషన్లకు మార్కులు..

ABN , Publish Date - Feb 08 , 2026 | 12:12 AM

జిల్లాలోని 34 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌ స్టేషన్‌, రెండు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పనితీరును బట్టి పోలీస్‌శాఖ మార్కులను కేటాయించింది.

 పోలీస్‌ స్టేషన్లకు మార్కులు..

మొదటి స్థానంలో జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 34 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌ స్టేషన్‌, రెండు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పనితీరును బట్టి పోలీస్‌శాఖ మార్కులను కేటాయించింది. కేసుల పరిష్కారం, కోర్టులో ఛార్జిషీట్లు వేయడం, కోర్టు నుంచి సీసీ నంబర్లను పొందడం, మూడేళ్ల నుంచి పెండిం గ్‌లో ఉన్న కేసులను పరిష్కరించడం, సీసీ టీఎన్‌ఎస్‌ వినియో గించడం, సీసీ టీఎన్‌ఎస్‌లో లాగిన్‌ అవ్వడం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఈ–చలానాలు, డ్రంకెన్‌ డ్రైవ్‌, వారెంట్లు అమ లు, కేసులను ఛేదించడం, చోరీ సొత్తు రికవరీ, అసాంఘిక కార్యకలాపాలు నిరోధించడం, లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కా రం తదితర అంశాల్లో ప్రతిభ కనబర్చిన పోలీస్‌ స్టేషన్లకు మార్కులను కేటాయించారు. కలెక్టరేట్‌లో ఈనెల 6వ తేదీన జరి గిన జిల్లా పోలీస్‌ శాఖ వార్షిక నేర సమీక్షలో ఈ మార్కులను ప్రకటించారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌ స్టేషన్‌ 776 మార్కులతో ప్రథమ స్థానంలో ఉండగా, కలిదిండి పోలీస్‌ స్టేషన్‌ 729 మా ర్కులతో ద్వితీయ స్థానం, ఏలూరు త్రీటౌన్‌ 726 మార్కులతో తృతీయస్థానం, చింతలపూడి పోలీస్‌ స్టేషన్‌ 712 మార్కులతో నాల్గో స్థానంలో నిలిచాయి. కాగా లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేష న్లలో వేలేరుపాడు ఆఖరిస్థానం 34లో నిలిచింది. ఏలూరు మహి ళా పోలీస్‌ స్టేషన్‌ –35, ఏలూరు సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ – 36, ఏలూరు ట్రాఫిక్‌–37, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌– 38 స్థానంలో నిలిచాయి. మార్కులను బట్టి అయా స్టేషన్ల సిబ్బందికి ప్రశంసా పత్రాలను ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ అందించారు.

Updated Date - Feb 08 , 2026 | 12:12 AM