తడికలపూడిలో ఫైరింగ్ శిక్షణ
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:27 AM
తడికలపూడి పోలీస్‌స్టేషన్ ఎదురుగా గల ఫైరింగ్ ప్రాక్టీస్ ఆవరణలో శుక్రవారం ఏలూరు రేంజ్ పరిధి లో సంవత్సరాంతపు క్రైం మీటింగ్‌ను పురస్కరించుకుని ఫైరింగ్ క్లాసులను నిర్వహించారు.
కామవరపుకోట, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): తడికలపూడి పోలీస్‌స్టేషన్ ఎదురుగా గల ఫైరింగ్ ప్రాక్టీస్ ఆవరణలో శుక్రవారం ఏలూరు రేంజ్ పరిధి లో సంవత్సరాంతపు క్రైం మీటింగ్‌ను పురస్కరించుకుని ఫైరింగ్ క్లాసులను నిర్వహించారు. ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి.అశోక్ కుమార్, ఎస్పీ కె.ప్రతాప శివకిశోర్, ఏఎస్పీ సూర్యచంద్రరావు, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, జంగారెడ్డి గూడెం ఏఎస్పీ సుస్మిత, ఏఆర్ ఏఎస్పీ జి.మునిరాజాలు ఏ విధంగా ఫైరింగ్ చేయాలి, ఎలా వ్యవహరించాలని, అప్రమత్తత, అత్యవసర పరిస్థితుల్లో ఆయు ధాల వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఫైరింగ్ క్లాసులు నిర్వహించి వారి ప్రగతిని అధికారులు నమోదు చేశారు. పలు డివిజన్లకు చెందిన పోలీసు అధికారులతో పాటు తడికలపూడి ఎస్‌ఐ పి.చెన్నారావు, రైటర్ సుధీర్, పీసీలు నాగూర్, అజయ్, రమేష్ పాల్గొన్నారు.