Share News

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:09 AM

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

జూ రైల్‌ నెంబర్‌ 07033 కాకినాడ టౌన్‌– మైసూర్‌కు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ ప్రతి సోమ, శుక్రవారం నడపనున్నారు.

జూ రైల్‌ నెంబర్‌ 07034 మైసూర్‌ – కాకినాడ టౌన్‌కు మార్చి 3వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ప్రతి మంగళ, శనివారం నడపనున్నారు. ఈ రెండు రైళ్ళు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ళు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్‌, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్‌, తండూర్‌, సేదం, యాద్‌గిర్‌, కృష్ణా, రాయచూర్‌, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్‌, అనంతపూర్‌, ధర్మవరం, హిందుపూర్‌, ఎలహంక, బెంగుళూరు సెంట్రల్‌, కెఎస్‌ఆర్‌ బెంగుళూరు, కనిగిరి, మాంద్య స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. ఈ రైళ్ళల్లో 1 ఎసీ, 2 ఎసీ, 3 ఎసీ, స్లీపర్‌ క్లాస్‌ అండ్‌ జనరల్‌ కోచ్‌లు ఉంటాయన్నారు.

జూ రైలు నంబరు 07153 నరసాపురం – ఎస్‌ఎంవిటి బెంగళూరుకు మార్చి 6వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం నడపనున్నారు.

జూ రైలు నంబరు 07154 ఎస్‌ఎంవిటి బెంగళూరు – నరసారం మార్చి 7వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు ప్రతి శనివారం నడపనున్నారు. ఈ రైళ్ళు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్‌, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, వంగోల్‌, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జాలర్‌పేటై, బంగర్‌పేట్‌, కృష్ణరాజ పురం స్టేషన్లలో ఆగనున్నట్లు తెలిపారు. ఈ రైళ్ళల్లో ఏసీ టూటైర్‌, ఎసీ త్రి టైర్‌, స్లీపర్‌ అండ్‌ జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని తెలిపారు.

Updated Date - Feb 07 , 2026 | 12:09 AM