విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి భరోసా కల్పించే విధంగా పింఛన్ మొత్తాన్ని పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
చావడానికైనా సిద్ధంగా ఉన్నామని.. ఎట్టి పరిస్థితుల్లో డేటా సెంటర్‌కి భూములిచ్చేది లేదని భోగాపురం రైతులు స్పష్టంచేశారు.
నెల్లిమర్ల నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు, మాజీ జడ్పీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడుని వైసీపీ సస్పెండ్ చేసింది.
టైరు పేలడంతో అదుపు తప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి, పల్టీలు కొట్టి రైలింగ్‌పైకి దూసుకె ళ్లింది.
సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తు న్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి అన్నారు.
Fill the Potholes, Prevent Waterlogging! తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు భారీగా గండి పడి రోజులు గడుస్తున్నా.. ఇంకా దానిని పూడ్చే చర్యలు చేపట్టడం లేదు. దీంతో నీరంతా వృథాగా పోతుంది. మరోవైపు 8వ బ్రాంచి పరిధి శివారు ప్రాంతంలోని ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.
Good News for Students of Welfare Hostels జిల్లాలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా సంక్షేమ హాస్టళ్ల డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే వాటిని అమలు చేయాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని గిరిజన, సాంఘిక, వెనుకబడిన తరగతులు, మైనార్టీ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, ఏకలవ్య, మోడల్ పాఠశాలలు, తదితర గిరిజన విద్యా సంస్థల్లో వసతి పొందుతున్న సుమారు 30 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
Action Against Failure to Maintain Cleanliness జిల్లాలో పరిశుభ్రత పాటించని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది కాలంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రజల ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు. మంచిగా చెప్పినా వినని వారి కోసం త్వరలోనే ‘మన్యం మర్యాద’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
పసుపు, కాఫీ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేయడానికి దోహదపడేలా బొటానిక్స్ పరిశ్రమను ప్రారంభించడం ఉత్తరాంధ్ర రైతులకు వరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నా రు.
సంకిలి ఈఐడీ ప్యారీ సుగర్స్ అనుబంధ పరిశ్రమ ఇథనాల్ ప్లాంట్ వ్యర్థజలాలతో సంకిలి నాయుడుచెరువు ఆయకట్టు 60 ఎకరాల వరిపంట నష్టంపై ఆ గ్రామ రైతులు మరో సారి ఆందోళన బాట పట్టారు.