ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:42 PM
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన మరోసారి వాయిదా పడింది. గతనెలలో బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి ఆయన రావాల్సి ఉన్నా.. అభివృద్ధి పనులు పూర్తికాని నేపథ్యంలో పర్యటనకు బ్రేక్ పడింది.
పార్వతీపురం, జూలై3(ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన మరోసారి వాయిదా పడింది. గతనెలలో బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి ఆయన రావాల్సి ఉన్నా.. అభివృద్ధి పనులు పూర్తికాని నేపథ్యంలో పర్యటనకు బ్రేక్ పడింది. కాగా ఈ నెల 6న పవన్ జిల్లాకు రానున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఆ గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే ఇంకా 50 శాతం పనులు పూర్తికావల్సి ఉండడంతో ఉపముఖ్యమంత్రి జిల్లా పర్యటన మళ్లీ వాయిదా పడినట్టు ఎమ్మెల్యే విజయచంద్ర శుక్రవారం రాత్రి విలేకరులకు ఫోన్‌లో తెలిపారు. పనులన్నీ పూర్తయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పర్య టన తేదీ ఖరారు అవుతుందని డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు తెలిపారని వెల్లడించారు.