Farmers' రైతుల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:37 PM
Farmers' Welfare Is the Top Priority రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తోందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం శివ్వన్నపేటలో రైతులకు రాజముద్రతో ఉన్న నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
శివ్వన్నపేటలో పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ
కురుపాం,జూలై3(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పనిచేస్తోందని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం శివ్వన్నపేటలో రైతులకు రాజముద్రతో ఉన్న నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. తప్పులను సరిదిద్ది, భూ వివాదాలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వారు అన్నారు. నూతన పట్టాదారు పాసు పుస్తకాలతో రైతుల భూములకు పూర్తి భద్రత చేకూరుతుందని చెప్పారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా భూ యజమానులకు పూర్తి హక్కులు కల్పిస్తున్నామన్నారు. భూ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. పాసు పుస్తకాల్లో ఏవైనా లోపాలుంటే వెంటనే తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చి సరిచేసుకావాలని రైతులకు సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి చెత్త సేకరణ ట్రై సైకిళ్లను అందించారు. పర్యావరణ పరిరక్షణ , స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయ, ఎంపీడీవో ఉమామహేశ్వరి, ఈవోపీఆర్‌డీ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.