Share News

రైతుల అభివృద్ధికి ప్రాధాన్యం

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:30 PM

రైతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

రైతుల అభివృద్ధికి ప్రాధాన్యం
రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేస్తున్న మంత్రులు అనిత, శ్రీనివాస్‌

- మంత్రులు అనిత, శ్రీనివాస్‌

- తాటిపూడి రిజర్వాయర్‌ నీరు విడుదల

గంట్యాడ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రైతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం తాటిపూడి జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేశారు. ముందుగా పూజలు నిర్వహించి అనంతరం రిజర్వాయర్‌ గేట్లను పైకెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ప్రతీ ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తుందన్నారు. ఎస్‌.కోట, గజపతినగరం నియోజకవర్గాల్లోని 15,300 ఎకరాలకు తాటిపూడి నీరు అందనుందని తెలిపారు. కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్‌, ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ పొలిట్‌బూర్యో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, గజపతినగరం ఏఎంసీ చైర్మన్‌ గోపాలరాజు, ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షుడు కె.జగన్నాథం, టీడీపీ నాయకులు కొండపల్లి కొండలరావు, భాస్కర్‌నాయుడు, అల్లు విజయకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:30 PM