ఆరోగ్యం, పోషణలో మన్యం ఫస్ట్
ABN , Publish Date - Jul 03 , 2026 | 11:34 PM
ఆరోగ్యం, పోషణ కార్యక్రమంలో సాధించిన ప్రగతికి గాను దేశంలోనే జిల్లాకు ప్రథమ స్థానం లభించిందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడు నెలలకొకసారి నీతి అయోగ్ ప్రకటించే డెల్టా ర్యాంకింగ్‌లో ఈ సారి జిల్లాకు మొదటి స్థానం దక్కిందని పేర్కొన్నారు.
పార్వతీపురం, జూలై3(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యం, పోషణ కార్యక్రమంలో సాధించిన ప్రగతికి గాను దేశంలోనే జిల్లాకు ప్రథమ స్థానం లభించిందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడు నెలలకొకసారి నీతి అయోగ్ ప్రకటించే డెల్టా ర్యాంకింగ్‌లో ఈ సారి జిల్లాకు మొదటి స్థానం దక్కిందని పేర్కొన్నారు. మొత్తంగా 123 జిల్లాల్లో ఈ ర్యాంకింగ్‌లో పోటీపడగా.. 90 అంశాల్లో వివిధ శాఖల పనితీరును పరిశీలించి నీతి అయోగ్ బృందం జిల్లాకు మొదటి ర్యాంకు ఇచ్చిందని వెల్లడించారు. గతంలో బేసిక్ ఇన్‌ఫ్రాలో దేశంలోనే జిల్లాకు రెండో స్థానం లభించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.