The goal is quality, free medical care. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (విలేజ్ హెల్త్ క్లినిక్‌లు) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 267 విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మంగళవారం మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు.
Massive explosion in the berry industry బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్ సెంటరులోని బెర్రీ పరిశ్రమలో మంగళవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫెర్రో మాంగనీస్ మెటల్ గెలాక్సియన్.. ట్యాంకు(స్లాగ్)లో పడటంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.
where is dovelopment in bhogapuram - భోగాపురం పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న కోనేరు చెరువును గతంలో మిషన్ అమృత సరోవర్ పథకం కింద సుందరీకరణ కోసం ప్రతిపాదనలు పంపారు. కొలతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఉపాధి హామీలో భాగంగా చెరువు గట్టును వెడల్పు చేశారు తప్ప ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఇటీవల అదే చెరువును పల్లెపండగ కార్యక్రమంలో అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏం చేస్తారో చూడాలి.
what about our path? ‘లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి.. 500 రోజుల్లో రెట్టింపు డబ్బులు మీ సొంతమవుతాయి’ అంటూ నమ్మబలికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేలాదిమంది నుంచి రూ.కోట్లు వసూలుచేసి, బోర్డు తిప్పేసిన హార్వెంచర్స్ ఇన్‌ఫ్రా సూత్రధారి పడిల్ సోమశేఖర్ ఎట్టకేలకు గాజువాక పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలో బాధితుల్లో న్యాయం జరుగుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో ఆ సంస్థ బాధితులు వేలాదిగా ఉన్నారు.
What Does That Little One Know… That Mom Is Gone and Won’t Return? తొలికాన్పులోనే పండంటి మగబిడ్డ పుట్టడడంతో ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. తన చిన్నారి ముఖం చూసి .. అప్పటివరకు భరించిన పురిటి నొప్పులను సైతం మరిచిపోయింది. సాధారణ ప్రసవమే జరగడంతో ఎందో ఆనందంతో బిడ్డతో కలిసి ఆసుపత్రి నుంచి పుట్టింటికి చేరింది. అయితే పసిబిడ్డతో ఎంతో సంతోషంగా ఉన్న ఆతల్లిపై విధి చిన్నచూపు చూసింది. ఏమైందో ఏమో కాని.. నెలరోజుల్లోనే ఆ బాలింత మృత్యుఒడిలోకి చేరింది.
Suspense Over BC Reservations స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా బీసీల రిజర్వేషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్ కల్పించిన సంగతి తెలిసిందే.
Scorching Heat in the Agency Areas జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఆర్నాబ్ తుఫాన్ తర్వాత .. మళ్లీ వాతావరణం వేడెక్కింది. వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Village Health Clinics Become Available జిల్లాలో రూ.4.62 కోట్లతో నిర్మించిన 11 విలేజ్ హెల్త్ క్షినిక్‌లు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం వాటిని వర్చువల్‌గా మంత్రి సత్యకుమార్‌యాదవ్ ప్రారంభించారు.
సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.
త్వర లోనే అన్ని కుటుంబాలకు సంజీవని వైద్య సేవలు అందనున్నాయని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.