Share News

Still Living Between Mud Walls! ఇంకా మట్టి గోడల మధ్యే!

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:06 AM

Still Living Between Mud Walls! దశాబ్దాలు గడుస్తున్నా... గిరిశిఖర గ్రామాల ప్రజలు పక్కా ఇళ్లకు నోచుకోవడం లేదు. మక్కువ మండలంలో నేటికీ అనేక మంది గిరిజనులు పూరి గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంతమంది ప్రజాప్రతి నిధులు మారినా.. వారి బతుకులు మాత్రం మారడం లేదు.

Still Living Between Mud Walls! ఇంకా మట్టి గోడల మధ్యే!
మట్టిగోడల ఇళ్లలోనే నివసిస్తున్న చెలకమెండంగి గిరిజనులు

  • గిరిశిఖర గ్రామాల్లో కానరాని పక్కా ఇళ్లు

  • ఆర్థిక స్థోమత లేక నిర్మాణానికి దూరం

  • కొండపైకి నిర్మాణ సామగ్రీ చేరని వైనం

మక్కువ రూరల్‌, ఫిబ్రవరి20(ఆంధ్రజ్యోతి): దశాబ్దాలు గడుస్తున్నా... గిరిశిఖర గ్రామాల ప్రజలు పక్కా ఇళ్లకు నోచుకోవడం లేదు. మక్కువ మండలంలో నేటికీ అనేక మంది గిరిజనులు పూరి గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంతమంది ప్రజాప్రతి నిధులు మారినా.. వారి బతుకులు మాత్రం మారడం లేదు. మండలంలోని బాగుజోల, చెలకమెండంగి, తాడిపుట్టి, కొంజపాక, సిరివర, పిరిడిపాక, బెలుగొండ, పొయ్యిమాల గ్రామాల్లో గిరిజనులకు పక్కా గూడు లేదు. మట్టిగోడలపై పెంకులు, రేకులు వేసుకుని నిర్మించుకున్న ఇళ్లలోనే ఇప్పటికీ నివసిస్తున్నారు. గృహ నిర్మాణ పఽథకం అమలు చేస్తున్నా.. నిరుపేదలైన గిరి జనులు డబ్బులు లేక గృహ నిర్మాణం చేపట్టలేకపోతున్నారు. కొండలపైన గ్రామాలకు సిమెంటు, ఐరెన్‌, మెటల్‌, ఇటుక తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం కూడా మరో కారణంగా ఉంది. మక్కువతో పాటు అన్ని మండలాల్లోని గిరిశిఖర గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు గిరిశిఖర గ్రామాల్లో మౌలిక వసతులు కొరవడ్డాయి. సీసీ రోడ్డు, కాలువల నిర్మాణాలు చేపట్టకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రాళ్లను గుట్టలుగా పేర్చుకొని వర్షాకాలంలో వారి ఇళ్లు కోతకు గురికాకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గిరిశిఖర గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చాలని గిరిజనులు కోరుతున్నారు. దీనిపై హౌసింగ్‌ ఏఈ సింహాచలాన్ని వివరణ కోరగా...‘ చెలక మెండంగి గ్రామానికి గతంలో మూడు గృహాలు మంజూరు కాగా వాటి నిర్మాణం పూర్తి చేశాం. మిగతా గిరి శిఖర గ్రామాల్లో సర్వే పూర్తయింది. పీఎం జన్‌మన్‌ కింద గిరిజనులకు పక్కా గృహాలు మంజూరు చేస్తాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. ’ అని తెలిపారు.

Updated Date - Feb 21 , 2026 | 12:06 AM