అన్యాయంపై ప్రశ్నిస్తే బెదిరింపులా?
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:48 PM
తమ భూముల్లోని టేకు, కొబ్బరిచెట్లను కొట్టేశారని, దీనిపై ప్రశ్నిస్తే.. పోలీసులు వచ్చి భయపెడుతున్నారని కిల్తంపాలెం రెవెన్యూలో భూములు ఉన్న పెదఖండేపల్లి పంచాయతీ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్.కోట రూరల్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం.. భూములు ఇవ్వండి అని అప్పట్లో తమ భూములు తీసుకుని, అన్యా యం చేశారని, ఇప్పుడు పరిశ్రమలు పెడతామ ని చెప్పి తమ భూముల్లోని టేకు, కొబ్బరిచెట్లను కొట్టేశారని, దీనిపై ప్రశ్నిస్తే.. పోలీసులు వచ్చి భయపెడుతున్నారని కిల్తంపాలెం రెవెన్యూలో భూములు ఉన్న పెదఖండేపల్లి పంచాయతీ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం వీరు మాట్లాడుతూ తమ జీవనాధారం అయిన చెట్లకు ఆనాడు పరిహారం ఇస్తామని చెప్పి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఆ చెట్లు నరికేశారని, ప్రశ్నిస్తే.. పోలీసులు వచ్చి భయపెట్టడంతో పాటు అడ్డుపడితే అరెస్టు చేస్తా మని బెదిరిస్తున్నారని వాపోయారు. తమ కు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేశ్‌లకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.