Share News

50 percent tax concession on vacant plots ఖాళీ స్థలాలపై 50 శాతం పన్ను రాయితీ

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:02 AM

50 percent tax concession on vacant plots ఖాళీ జాగాలపై వీఎల్‌టీ(వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) 50 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

50 percent tax concession on vacant plots ఖాళీ స్థలాలపై    50 శాతం పన్ను రాయితీ

ఖాళీ స్థలాలపై

50 శాతం పన్ను రాయితీ

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి, భవన నిర్మాణ దారులకు ఊరట

బొబ్బిలిలో 1350 అసెస్‌మెంట్లు గుర్తింపు

రూ.1.02 కోట్ల పన్ను డిమాండ్‌

బొబ్బిలి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి):

ఖాళీ జాగాలపై వీఎల్‌టీ(వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌) 50 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రియల్‌ ఎస్టేటర్లు, భవన నిర్మాణదారులకు ఊరటే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాయితీకి సంబంఽధించిన జీవో విడుదల చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరోసారి రాయితీని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో ఖాళీగా ఉన్న నివేశనా స్థలాలపై ఇంతవరకు 0.2 శాతం చొప్పున మునిసిపాలిటీలు పన్ను వసూలు చేస్తున్నాయి. ఇక నుంచి 0.1 శాతం చెల్లిస్తే చాలు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పొందుపరిచిన భూముల విలువ ఆధారంగా ఈ పన్నును వసూలు చేస్తారు. రియల్‌ఎస్టేట్‌ రంగం మందగమనంతో ఉన్న నేపథ్యంలో ఈ వీఎల్‌టీ రాయితీ కొంత ఉపశమనంగా వారు భావిస్తున్నారు. ఇప్పటికే బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ అమలులో ఉన్నాయి. వీటికి తోడు వీఎల్‌టీ రాయితీని ప్రకటించడం రియల్‌ఎస్టేట్‌ రంగానికి ఊతమిచ్చినట్లుగా వ్యాపారులు, ఖాళీ స్థలాల యజమానులు అంటున్నారు.

- బొబ్బిలి మునిసిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలకు సంబంధించిన అసెస్‌మెంట్లు 1350 ఉన్నాయి. వాటి నుంచి ఏటా రూ.1.02 కోట్ల వీఎల్‌టీ వసూలు కావాల్సి ఉంది. ఆ ఖాళీ స్థలాల్లో భవన నిర్మాణ అనుమతుల కోసం వాటి యజమానులు దరఖాస్తు చేసుకున్నప్పుడు వీఎల్‌టీలో 50 శాతం రాయితీ వర్తిస్తుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) కోసం మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా ఈ పన్ను రాయితీ వర్తిస్తుంది.

ఈ ఏడాది రూ.31.30 లక్షలు వసూలు

లాలం రామలక్ష్మి, మునిసిపల్‌ కమిషనరు, బొబ్బిలి

మునిసిపాలిటీ పరిఽధిలో గత ఏడాది రూ. 49 లక్షలు వీఎల్‌టీ వసూలు కాగా ఈ ఏడాది ఇంతవరకు రూ.31.30 లక్షలు వసూలైంది. పాత హుగ్లీజూట్‌మిల్లు పరిధిలో ఖాళీ స్థలాల నుంచి రూ.39 లక్షలు వసూలు కావాల్సి ఉంది. జేకేఆర్‌ ఇండస్ర్టీస్‌ నుంచి రూ.10.68 లక్షలు వసూలు కావాలి. ఈ రెండు స్థలాల్లో ప్లాట్లు వేశారు. వారందరికీ వీఎల్‌టికి సంబంధించి నోటీసులు జారీ చేశాం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వీఎల్‌టీ రాయితీకి సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

============

Updated Date - Feb 21 , 2026 | 12:02 AM