వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:45 PM
హిందూ సమా జం తలదించుకునేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీ పీ సభ్యులు క్షమాపణ చెప్పాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు.
ఎంపీ కలిశెట్టి
విజయనగరం టౌన్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): కాళ్లకు చెప్పులు తీయకుండా శాసనమండలిలోకి వేంక టేశ్వరస్వామి ఫోటోలను తీసుకువచ్చి హిందూ సమా జం తలదించుకునేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీ పీ సభ్యులు క్షమాపణ చెప్పాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. జిల్లా కేం ద్రంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. సభలోకి వచ్చి దేవుడుతో రాజకీయం చేయడం తగద న్నారు. వారి తీరుకు తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తు న్నామన్నారు. జగన్మోహన్‌రెడ్డి అండ్ టీం హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.