Diet student suicide? భావి ఉపాధ్యాయుడు కావాల్సిన ఆ యువకునికి ఏం కష్టమొచ్చిందో.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఎన్నో ఆశలతో ఉపాధ్యాయ ట్రైనింగ్‌కు వచ్చి జీవితాన్నే ముగించాలన్న ఆలోచనకు ఎందుకు వచ్చాడో కాని అతని బలవన్మరణం తోటి విద్యార్థులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది.
are they safe బంగ్లాదేశ్‌లో బందీలైన మత్స్యకారులను తలుచుకుని వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. చాలా రోజులైనా తమ వారి రాకపై స్పష్టత రాకపోవడంతో భయపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వారి రాక ఆలస్యమవుతుందేమోనని కలవరపడుతున్నారు.
వైద్యకళాశాలలపై లేనిపోని రాద్దాంతం చేస్తూ ప్రజలను వైసీపీ తప్పుదోవ పట్టిస్తోందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మండిపడ్డారు.
పెండింగ్ అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ వ్యవహారాల శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. బుధవారం సాయంత్రం జిల్లాలో జరుగుతున్న పలు అభి వృద్ధి కార్యక్రమాల పురోగతి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టరుతో చర్చించారు.
Today is Christmas క్రిస్మస్ పండుగ కళ వచ్చేసింది. ఇళ్లు, చర్చిలు విద్యత్ దీపాలతో అందంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ ట్రీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శాంతాక్లాజ్ వేషధారణలో పిల్లలు, పెద్దలు ముందురోజు నుంచే సందడి చేస్తున్నారు.
Beach on the sand ఇసుక సేకరణలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో కొందరు వ్యక్తులు అక్రమ వ్యాపార సామ్రాజ్యం నిర్మించేశారు. నదుల చెంత ఉన్న వారు ఇసుకను ఉచితంగా పొందవచ్చునని ప్రభుత్వం చెబితే నదిని ఆక్రమించేసి... నచ్చిన చోటల్లా ఇసుకను తవ్వేసి... ఓ చోట పోగేసి.. ధరను నిర్ణయించేసి ఇష్టారాజ్యంగా ట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు. ఎవరైనా అడిగితే ఇక్కడివారమేనని, ఓ రైతు ఇంటి కోసం ఇసుకను సేకరిస్తున్నామని బొంకుతున్నారు. అసలు విషయం వేరే ఉంది. ఇసుకతో బడా వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.2లక్షల వరకు సంపాదిస్తున్నారు. వారి దందాకు గోస్తనీ నది రూపురేఖల్లేకుండా పోతోంది.
: కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా డీసీసీబీ, వాటి అనుబంధ శాఖలను తీర్చిదిద్దే లక్ష్యంతో వినూత్న పథకాలను అందుబాటు లోకి తీసుకు రానున్నట్టు డీసీసీబీ చైర్మన్ కిమి డి నాగార్జున చెప్పారు.
మండలంలోని బానాది గ్రామంలో ఐదు దేవాలయాల్లో ఈనెల 13న జరిగిన వరుస దొంగతనాల కేసును వల్లంపూడి పోలీసులు ఛేదించారు.
కొత్తవలస మండలం జోడుమెరక గ్రామానికి చెందిన జోడు అప్పన్నకు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయాధికారి కె.నాగమణి 20 ఏళ్లు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించినట్టు ఎస్పీ దామోదర్ తెలిపారు.
మండలంలోని గంగాపు రం పంచాయతీ హిందూపురం జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.