Share News

వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై నిరసన

ABN , Publish Date - Feb 21 , 2026 | 11:52 PM

శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరుకు వ్యతిరేకంగా జిల్లాలోని పలుచోట్ల కూటమి ఎమ్మెల్యేలు శనివారం నిరసన చేపట్టారు.

వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై నిరసన

  • ఆలయాల్లో సంప్రోక్షణ, పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు

శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరుకు వ్యతిరేకంగా జిల్లాలోని పలుచోట్ల కూటమి ఎమ్మెల్యేలు శనివారం నిరసన చేపట్టారు. ఈ మేరకు ఆలయాల్లో సం ప్రోక్షణ, పూజలు నిర్వహించారు.

హిందువుల మనోభావాలు దెబ్బతీశారు: ఎమ్మెల్యే లలితకుమారి

ఎస్‌.కోట రూరల్‌, ఫిబ్రవరి 21(ఆంధ్ర జ్యోతి): శాసనమండలి సాక్షిగా వైసీపీ ఎమ్మెల్సీలు హిందువుల మనోభావాలు దెబ్బతీయడం దారుణమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. వైసీపీ నాయకుల వ్యాఖ్యలు, వేంకటేశ్వరస్వా మి పట్ల వారు అనుసరించిన తీరుకు నిరసనగా ఆమె శనివారం భర్తపురం కల్యాణవైభోగ వేంకటేశ్వరస్వామి ఆలయం లో సంప్రోక్షణ నిర్వహించారు. టీడీపీ మండల అధ్య క్షుడు డోకుల అచ్చెంనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ జీఎస్‌ నాయుడు, వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ శ్రీలక్ష్మి, దాసరి కార్పొ రేషన్‌ డైరెక్టర్‌ బంగారునాయుడు, నాయకులు కిరణ్‌, వాసు తదితరులు పాల్గొన్నారు.

ఇది నీచ రాజకీయాలకు పరాకాష్ట: ఎమ్మెల్యే నాగమాధవి

డెంకాడ, ఫిబ్రవరి 21(ఆంధజ్యోతి): శాసనసభలో వైసీపీ శ్రేణులు కళ్లకు చెప్పులు విడవకుండా వేంకటేశ్వ రస్వామి ఫొటోలతో నినాదాలు చేయడం.. వారి నీచ రాజకీయాలకు పరాకాష్ట అని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. ఈ మేరకు శనివారం ఆమె గంట్లాం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ సీఈవో లోకం ప్రసాద్‌, జొన్నాడ పీఏసీఎస్‌ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు (పాలు శ్రీను), పైల శంకరరావు, జన సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 11:52 PM