పైడితల్లి జాతరను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:53 PM
రాజాం లో ఆదివారం నుంచి జరుగనున్న పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శత వసంత మహోత్సవాలను పకడ్బంధీగా నిర్వహించాలని ఏఎస్పీ సౌమ్యలత అధికారులను ఆదేశించారు.
ఏఎస్పీ సౌమ్యలత
రాజాం రూరల్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాజాం లో ఆదివారం నుంచి జరుగనున్న పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శత వసంత మహోత్సవాలను పకడ్బంధీగా నిర్వహించాలని ఏఎస్పీ సౌమ్యలత అధికారులను ఆదేశించారు. అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాట్లను ఆమె శనివారం పరిశీలించారు. క్యూలైన్లలో టికెట్ కౌంటర్లు, కొబ్బరి కాయలు కొట్టేందుకు ఏర్పాటు చేయవద్దన్నారు. క్యూలైన్ ప్రారంభంలోనే వీటిని ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. జాతరలో అవాంఛ నీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉచిత దర్శనం తప్పనిసరి: దేవదాయ శాఖ ఏసీ
జాతరకు వచ్చే భక్తులకు ఉచిత దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించాలని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష సూచించారు. శనివారం ఆమె అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లు పరిశీ లించారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటేనే రూ.20 టికెట్ ఇవ్వాలని, అలాకాకుండా కేవలం దర్శనం కోసం వస్తే ఉచితంగా పంపించాలని ఈవో మాధవరావును ఆదేశించారు. ఆలయంలో భక్తుల గోత్రనామాలతో పూజలు చేయవద్దని సూచించారు.