Share News

Self-Reliance మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:09 AM

Women Must Achieve Financial Self-Reliance మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం పి.కోనవలస గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 Self-Reliance మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌

పాచిపెంట, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం పి.కోనవలస గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ డిగ్రీ సాధించేలోగా ప్రతిఒక్కరూ ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి.. అంతవరకు వివాహం చేసుకోకూడదు. ఉజ్వల భవిష్యత్‌కు వ్యక్తిగత అవగాహన అవసరం. పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండొచ్చు. విద్యార్థినులు చదువుతో పాటు నృత్యం వంటి ఇతర కళల్లో కూడా రాణించాలి. 16 ఏళ్ల వయసులో ఎల్లప్పుడూ చురుగ్గా కనిపించాలి. నిస్తేజంగా ఉండరాదు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలో ఎలా మెలగాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై కూడా అవగాహన కలిగి ఉండాలి. ’ అని తెలిపారు. అనంతరం బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలు, చట్టపరమైన చర్యలు, పోక్సో చట్టంపై వివరించారు. పోలీస్‌ సేవలు, భద్రతా యాప్‌లను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ డి.రవి, సీడీపీవో బి.అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:09 AM