Share News

వాస్తవ వివరాలే నమోదు చేయండి

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:13 AM

ఈ-నారి సర్వేలో గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబ వాస్తవ వివరాలనే నమోదు చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి ఆదేశించారు.

వాస్తవ వివరాలే నమోదు చేయండి
సూచనలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ సుధారాణి

సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఈ-నారి సర్వేలో గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబ వాస్తవ వివరాలనే నమోదు చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి ఆదేశించారు. ఈ-నారి సర్వేను ఆమె బాగువలసలో శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బందితో ఆమె మాట్లా డారు. ఎస్‌హెచ్‌జీ ఇన్‌కమ్‌ యాప్‌లో వాస్తవిక సమాచారం ప్రతిబించాలన్నారు. జీవనోపాధులు సర్వే వల్ల భవిష్యత్‌లో కుటుంబానికి మేలు జరిగేలా ఉండాల న్నారు. సభ్యులు తీసుకున్న అప్పులు, ఎలా పెట్టుబడులు పెడుతున్నారు? వారి ప్రాధాన ఏంటి? ఇంట్లో వారు చేస్తున్న వృత్తి, వ్యాపారం, వారికొచ్చే ఆదాయం తదితర వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. సర్వేలో తప్పులు నమోదు చేస్తే సిబ్బందిపై చర్యలకు వెనుకాడ బోమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీఎం అంపల్లి జయమ్మ, సీసీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:14 AM