గంజాయి విక్రయించినా, రవాణా చేసినా జైలుకే..
ABN , Publish Date - Feb 21 , 2026 | 11:50 PM
జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయించినా, వినియోగించినా, రవాణా చేసినా జైలు శిక్ష తప్పదని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 21( ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయించినా, వినియోగించినా, రవాణా చేసినా జైలు శిక్ష తప్పదని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువత గంజాయి వ్యాపారుల ఉచ్చులో పడి భవి ష్యత్తుని నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి వ్యాపారాలు సాగిస్తున్న గ్రూప్‌ల లింకులు చేధించి కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణాకు ఎవరూ పాల్పడినా, ఊపేక్షించేది లేదన్నారు. సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించి గంజాయి అక్రమ రవాణాకు ప్రఽధాన సూత్రదారులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పాటు చెక్‌పో స్టులను బలోపేతం చేసి, గంజాయి నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడ తామని చెప్పారు. గంజాయి కేసులో పట్టుబడిన నిందితులపై హిస్టరీ షీట్ తెరచి, నిరంతరం నిఘా పెడుతున్నామని పిట్ ఏన్‌డీపీఎస్ పీడీ యాక్టు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.