పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కలిగినదని పేర్కొన్నారు.
Steps Taken Towards Neradi Barrage Construction దీర్ఘకాలంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దు వివాదంలో నలుగుతున్న నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.614 కోట్లు కేటాయించారు.
అంగన్‌వాడీ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అన్నారు.
accident గోతులమయమైన బొబ్బిలి-రామభద్రపురం జాతీయ రహదారిలో ఆదివారం ఘోరం జరిగిపోయింది. రోజూ అదే దారిలో ప్రయాణించే ఓ యువకుడు గుంతను గుర్తించలేకపోయాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అందులో నీరు చేరి ఉండడంతో గోతిని గమనించలేక యథావిధిగా ముందుకెళ్లాడు.
Nine Built, Only Two Functioning! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో పలుచోట్ల నిర్మించిన వేబ్రిడ్జిలు (బరువు వంతెన) నిరుపయోగంగా మారాయి. రైతుల ప్రయోజనార్థం వాటికోసం లక్షలాది రూపాయలతో వెచ్చించారు. అయితే ప్రధాన రహదారికి పక్కన కాకుండా వాహనాలు తిరగలేని ప్రదేశాలలో వేబ్రిడ్జిలను నిర్మించారు. దీంతో అవి పూర్తిగా వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం తుప్పు పట్టి మరమ్మతులకు గురయ్యాయి.
I am unable to save my son... అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తనయుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుండడాన్ని చూస్తూ ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. బాలుడి ఆరోగ్యాన్ని బాగు చేసేందుకు ఆస్పత్రులకు తిప్పుతున్నాడు. ఉన్న డబ్బులంతా ఖర్చు చేశాడు.
Struggling with Vacancies… Buildings in Ruins జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశువైద్యశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఎప్పుడు కులుతాయో తెలియని పరిస్థితి. దీంతో సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. మరోవైపు పాడి రైతులు కూడా పశు వైద్యశాలలకు వెళ్లేందుకు ఆలోచించాల్సి వస్తోంది. పరిస్థితి దయనీయంగా ఉండడంతో కొన్నిచోట్ల పరాయి పంచన పశు వైద్యశాలలు, డిస్పెన్సరీ యూనిట్లను నిర్వహిస్తున్నారు.
Don't dismiss it as just a minor injury. చిన్న గాయమే అని నిర్లక్ష్యం చేస్తే... ఆ విష క్రిమి ప్రాణాలనే బలి తీసుకుంటుంది. రేబీస్ వ్యాధి తీవ్రతను చాటి చెప్పే చేదు నిజమిది. పెంపుడు జంతువులు లేదా వీఽధి కుక్కలు కరిచినప్పుడు తగిన చికిత్స చేసుకోకపోవడంతో ఏటా వేల సంఖ్యలో ప్రజలు ఈ భయంకరమైన వ్యాధి బారిన పడుతున్నారు.
Father’s Final Rites Tomorrow… Where Is the Son? తండ్రి చనిపోయి 12 రోజులు కావస్తోంది. తెల్లారితే పెద్దకర్మ. అయితే ఇంతలో ఆ కొడుకు ఏమయ్యాడో తెలియని పరిస్థితి. అప్పులబాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని పెద్దగెడ్డ వద్ద ఆ లేఖ లభ్యమవడంతో ఆ వ్యక్తి జలాశయంలో దూకి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు సందేహిస్తున్నారు. ఈ మేరకు మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Not even half the seats are filled! రాజాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కనీస స్థాయిలో కూడా అడ్మిషన్లు కాలేదు. ఇక్కడ ఐదు గ్రూపులు ఉన్నాయి. బీఎస్సీతో పాటు బీఏ, బీకాం వంటి సంప్రదాయ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. 240 సీట్లు ఉండగా కేవలం 98 సీట్లు భర్తీ కావడం గమనార్హం.