Share News

కొత్త జాబ్‌ కార్డులకు దరఖాస్తు చేసుకోండి

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:53 PM

కొత్త జాబ్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో ఐ. సురేష్‌ సూచించారు.

కొత్త జాబ్‌ కార్డులకు దరఖాస్తు చేసుకోండి
రేగిడి: బూరాడ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీడీ చంద్రకుమారి

చీపురుపల్లి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కొత్త జాబ్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో ఐ. సురేష్‌ సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం జరిగిన గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాన్ని విడిచి వెళ్లిన వారి జాబ్‌ కార్డులు తొలగించి, అర్హులైన వారికి కొత్తకార్డులు జారీ చేయాలన్నారు. జాబ్‌ కార్డులు పొందిన వారికి మాత్రమే ఉపాధి హామీ పథకంలో పను లు కల్పిస్తామన్నారు. జాబ్‌ కార్డుల తొలగింపు నకు గ్రామ సభల్లో ఆమోదం తెలిపారు. ఈ గ్రామ సభల్లో ఏపీవో ఆదిబాబు, టీఏ, ఫీల్డ్‌ సహాయకులు పాల్గొన్నారు.

రేగిడి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): చనిపోయిన ఉపాధి వేతనదారుల జాబ్‌కార్డులను తొలగించి కొత్తవారి కి వాటిని మంజూరు చేయాలని రాజాం ఏపీడీ చంద్రకు మారి అన్నారు. మండలంలో 39 గ్రామ పంచాయతీల్లో శనివారం ఉపాధి పనులు గుర్తింపుపై గ్రామసభలు నిర్వహించారు. బూరాడలో నిర్వహించిన గ్రామసభను వైస్‌ఎంపీపీ వి.జగన్మోహనరావుతో కలిసి ఏపీడీ పర్యవేక్షించి మాట్లాడారు. కొంతమందికి ఉపాధి కార్డులు లేకపోవడంపై ఆమె స్పందించారు. పుర్లిలో నిర్వహించిన గ్రామసభను ఏపీవో హరనాథ్‌ పర్యవేక్షించారు. కార్యక్రమంలో కోర్సు డైరె క్టర్‌ చిన్నంనాయుడు, నాగభూషణరావు, శంకర్‌ పాల్గొన్నారు.

నెల్లిమర్ల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ కొత్త జాబ్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఏపీవో రామారావు సూచించారు. అన్ని పంచాయతీల్లో శనివారం ఉపాధిహామీపై గ్రామ సభలు నిర్వహించారు. చనిపోయిన వారి జాబ్‌కార్డులను తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. అలాగే పనుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీవో సూచించారు. క్షేత్రసహాయ కులు, టీఏలు పాల్గొన్నారు.

లక్కవరపుకోట, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): అర్హులైన వారికి కొత్త జాబ్‌కార్డులు మంజూరు చేసేందుకు శనివారం ఏపీవో విజయలక్ష్మి ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈకేవైసీ పరిశీలన అనంతరం చనిపోయినవారిని, పూర్తిగా గ్రామం విడిచి వెళ్లిన వారిని తొలగించి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. తొలగించిన పేర్లు, అర్హుల పేర్లు గ్రామసభల్లో చదివి ఆమోదించినట్లు ఏపీవో తెలిపారు. ఇంకా ఎవరైనా జాబ్‌కార్డులు కావాలంటే తమను సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:53 PM