ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:51 PM
ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మంత్రి కొండపల్లి
విజయనగరం రూరల్, నవంబరు 22 ( ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శనివారం టీడీపీ కార్యాల యంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజుతో కలిసి ప్రజలను నుంచి వినతులు స్వీకరించారు. సామాజిక పింఛన్లు, ఇళ్లు, రు ణాలు మంజూరు చేయాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కల్పించాలని కోరుతూ పలువురు వినతులు ఇచ్చారు. వినతులు పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లా డుతూ.. ఈ సమస్యలను దశలవారీగా పరిష్కరించను న్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహి స్తున్నామన్నారు. పార్టీ ఆదేశాల మేరకు శనివారం మంత్రి శ్రీనివాస్ వినతులు స్వీకరించారని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ ప్రేమను పంచుదాం
ఎస్.కోట రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి)ః భగవాన్ సత్యసాయి పంచిన ప్రేమను సేవ రూపంలో ప్రతి ఒక్కరికీ పంచుదామని మంత్రి కొండపల్లి శ్రీనివాస రావు అన్నారు. శనివారం చినఖండేపల్లి సాయి దివ్యా మృతంలో నిర్వహించిన సత్యసాయి శతజయంతి ఉత్స వాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ఆధ్వర్యం లో గిరిజనులకు దుప్పట్లు, విద్యార్థులకు విద్యాసామగ్రి అందించారు. నిర్వాహకుడు కుమార్‌ను అభినందించారు.