లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:52 PM
కార్మికులు, ఉద్యోగులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.వాసుదేశ రావు డిమాండ్ చేశారు.
రాజాం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) కార్మికులు, ఉద్యోగులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.వాసుదేశ రావు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్‌పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని శనివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పొనుగుటివలస కూడలి వద్ద నాలుగు లేబర్ కోడ్స్ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దారు ణం అన్నారు. వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సుర స్త్రస్, జిల్లా కార్యదర్శి ఎం.త్రినాథ్, నాయకులు పాల్గొన్నారు,
రాజాం రూరల్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి రామ్మూర్తినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్ సమీ పంలో రాస్తారోకో నిర్వహించారు. పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కిల్లంపల్లి రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ శనివారం స్థానిక విద్యుత్ జిల్లా స్టోర్స్ వద్ద హమాలీలు నిరసన వ్యక్తం చేశారు. జీవో కాపీలు దహనం చేశారు. కార్యక్రమంలో విద్యుత్ హమాలీ సంఘం నాయకులు పతివాడ లక్ష్మణ రావు, మీసాల లెనిన్, కలిశెట్టి శ్రీను పాల్గొన్నారు.