Share News

danger to uriya మించితే ముప్పే!

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:45 PM

danger to uriya జిల్లాలో వరి సాగు అత్యధికంగా ఉంది. దిగుబడుల కోసం యూరియాను పోటాపోటీగా చల్లుతున్నారు. భూమిని కెమికల్‌తో నింపేస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్‌ నిశబ్దంగా వ్యాపిస్తుంది. వ్యవసాయాధారిత రాష్ట్రాలు పంజాబ్‌, హర్యానాలో ఇదే జరిగింది.

danger to uriya మించితే ముప్పే!

మించితే ముప్పే!

పంటలకు యూరియా అధిక వినియోగంతో క్యాన్సర్‌

బాగా తగ్గించాలంటున్న అధికారులు

అవగాహన సదస్సుల నిర్వహణకు ప్రభుత్వ ఆదేశం

ప్రత్యామ్నాయంగా సూక్ష్మపోషకాలను అందించే దిశగా ప్రయత్నాలు

- జిల్లాలో వరి సాగు అత్యధికంగా ఉంది. దిగుబడుల కోసం యూరియాను పోటాపోటీగా చల్లుతున్నారు. భూమిని కెమికల్‌తో నింపేస్తున్నారు. దీనివల్ల క్యాన్సర్‌ నిశబ్దంగా వ్యాపిస్తుంది. వ్యవసాయాధారిత రాష్ట్రాలు పంజాబ్‌, హర్యానాలో ఇదే జరిగింది. దిగుబడుల కోసం అక్కడ యూరియా అధికంగా వాడారు. ఫలితంగా ఆ రాష్ట్రాల్లో 30శాతం క్యాన్సర్‌ రోగులు ఉన్నారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో వారే ఎక్కువ కనిపిస్తారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలి. సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలి. అప్పుడే క్యాన్సర్‌ ముప్పు నుంచి తప్పించుకుంటాం.

మూడు రోజుల కిందట వేపాడలో కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి రైతులకు ఇచ్చిన సూచనిది

శృంగవరపుకోట, నవంబరు 22(ఆంధ్రజ్యోతి):

క్యాన్సర్‌ కేసులు ఇప్పటికే అధికమయ్యాయి. కొన్నిప్రాంతాల్లో ఆందోళనకరంగా నమోదవుతు న్నాయి. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపించడమే క్యాన్సర్‌ విజృంభణకు ప్రధాన కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పంటల్లో యూరియా వాడకం తగ్గించకపోతే భవిష్యత్‌లో తీవ్రపరిణామాలు తప్పవు. సాగులో మోతాదుకు మించి యూరియాను వాడుతుండ డంతో క్యాన్సర్‌ ప్రబలే అవకాశాలు ఎక్కువ. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో వ్యవసాయ రంగంపై జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్యాన్సర్‌ అత్యంత ప్రమాదకరమైన టాప్‌-5 వ్యాధుల్లో ఒకటిగా ఉందని గుర్తుచేశారు. పంటలకు రసాయన ఎరువు వాడొద్దని కూడా చెప్పారు. యూరియా అధిక వాడకంపై రైతుల్లో చైతన్యం రావాలన్నారు.

- మొక్కలకు నత్రజనిని అందించడానికి ఉపయోగపడే ఒక సాధారణ ఎరువు యూరియా. ఇది ఆకుల్లో పచ్చదనం పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మొక్కల కిరణజన్య సంయోగ క్రియకు సహాయపడుతుంది. ఇదంతా వ్యవసాయ శాఖ సూచనల మేరకు యూరియాను పంటకు అందించినప్పుడు ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ రైతులు అత్యశకు పోతున్నారు. వ్యవసాయ శాఖ చెప్పిన విధంగా కాకుండ యూరియా అధికంగా అందిస్తున్నారు. దిగుబడులు అధికంగా వస్తాయని భ్రమపడుతున్నారు.

జిల్లాలో వరి పంట ఎక్కువ. దీనికి మూడు దఫాలుగా విస్తీర్ణం బట్టి 70 కేజీల వరకు యూరియాను అందించాలని వ్యవసాయ శాఖ చెబుతోంది. రైతులు మాత్రం ఇందుకు రెంటింపు 100 కేజీల నుంచి 140 కేజీల వరకు వాడేస్తున్నారు. ఇది ప్రమాదకరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా వినడం లేదు. వరి ఉబాలు సమయం నుంచి పాలుపోసుకోనే వరకు యూరియా కోసం ఎక్కడదొరికితే అక్కడకు పరుగెడుతున్నారు. యూరియా అధిక వాడకంతో జరుగుతున్న దుష్ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం ఈ ఏడాది యూరియా వాడకం అవసరం మేరకు జరగాలని సరఫరాను కంట్రోల్‌ చేసింది. ప్రత్యామ్నాయ ఎరువుల వాడకం అలవాటు చేయాలని చూసింది. రైతులు మాత్రం యూరియా కోసం క్యూ కట్టారు. దీన్ని అసరాగా తీసుకున్న ప్రతిపక్ష వైసీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నించింది. ధర్నాలకు పిలుపునిచ్చింది. రైతులు రాకపోయినా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హడావిడి చేశారు.

చైతన్యవంతులైతేనే...

యూరియా ఎక్కువైతే జరిగే నష్టాన్ని రైతులు స్వయంగా గుర్తించాల్సి ఉంది. వాడకం ఎక్కువ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. పైరు విపరీతంగా పెరుగుతుంది. ముదురు ఆకుపచ్చరంగుకు మారి చీడలకు అధికంగా గురవుతుంది. పంటకు వాడిన యూరియాను మొక్కలు కేవలం 30 నుంచి 35 శాతమే వినియోగించుకుంటాయి. మిగతా అంతా వృథాగా పోతుంది. చీడపీడల నివారణకు అధిక ఖర్చును రైతులు భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి దిగుబడులపై ప్రభావం చూపుతోంది. క్రమేపీ భూమి నాణ్యత తగ్గుతోంది. నీటి, వాయు కాలుష్య కేంద్రంగా మారుతోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం యూరియా వాడకం తగ్గించాలను కుంటోంది. ప్రత్యామ్నాయంగా సూక్ష్మపోషకాలను సప్లిమెంట్ల రూపంలో అందించాలన్న ఆలోచన చేస్తోంది. సేంద్రియ ఎరువు వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. క్యాన్సర్‌ కారకంగా మారకముందే రైతులను మేల్కొల్పుతోంది.

----------------

Updated Date - Nov 22 , 2025 | 11:45 PM