సాహిత్యానికి పుట్టినిల్లు విజయనగరం
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:55 PM
సాహిత్యానికి పుట్టినిల్లు విజయనగరం అని, ఇక్కడ మహాకవి గురజాడ వంటి మహానుభావులు పుట్టారని సెంచూరియన్ యూని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు కొనియాడారు.
నెల్లిమర్ల, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సాహిత్యానికి పుట్టినిల్లు విజయనగరం అని, ఇక్కడ మహాకవి గురజాడ వంటి మహానుభావులు పుట్టారని సెంచూరియన్ యూని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు కొనియాడారు. 1904లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన స్పైయిన్ రచయిత జోస్ ఎచేగరే రాసిన నాటకాన్ని ప్రముఖ రచయిత పూలబాల వెంకట్ ప్రసాద్ తెలుగులో ఏ దేశమేగినా అనే పేరుతో అనువదించారు. శనివారం సెంచూరియన్ విశ్వవి ద్యాలయంలో ప్రొఫెసర్ డీఎన్.రావు ఈ పుస్తకాన్ని ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పెయిన్ సంస్కృతి, భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉంటుందని తెలి పారు. కార్యక్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్.రాజు, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి, రిజి స్ట్రార్ పల్లవి, రాజశేఖర్, అధ్యాపకులు పాల్గొన్నారు.