Is it 'safe'? ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలి. కానీ ఏడాదికి రెండుసార్లు కూడా శుభ్రం చేసిన దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలి. వర్షాకాలంలో మాత్రమే అదీ మొక్కుబడిగా చేస్తున్నారు. ఏడాదికి రెండుసార్లు నీటి పరీక్షలు చేసి లోపాలను సవరించాలి. ఈ ప్రక్రియ కూడా అంతంతమాత్రమే. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ట్యాంకుల తీరును పర్యవేక్షించాలి. ఎక్కడా జరగడం లేదు. వెరసి ప్రజలకు అపరిశుభ్రమైన తాగునీరు సరఫరా అవుతోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
Warehouses are empty జిల్లాలో చాలా గోదాములు వృథాగా పడి ఉన్నాయి. రైతులకు ఉపయోగపడడం లేదు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. రైతులు పండించిన పంటను, వ్యవసాయ ఉత్పత్తులను దాచుకునేందుకు వీలుగా ప్రాథమిక వ్యవసాయపరపతి సంఘాలకు సంబంధించి గోదాములు నిర్మించారు కానీ అవి గ్రామాలు, పట్టణాలకు దూరంగా ఉన్నాయి.
It only works if you give money. జిల్లాలోని ఓ తహసీల్దార్ 22(ఎ)లో ఉన్న చెరువును జిరాయితీగా మార్చి వేరొకరి పేరున రికార్డుల్లో నమోదు చేశారన్న ఆరోపణ ఉంది. జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండానే సబ్ డివిజన్ చేసి వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారని, అలాగే అడంగల్‌లోనూ మార్పులు చేసేశారని చెప్పుకుంటున్నారు
): ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలని ఉద్దేశంతో వచ్చిన మావోయిస్టు నేతలను ఆసు పత్రి నుంచి తీసుకువెళ్లి ఎన్‌కౌంటర్ పేరిట చంపడం దుర్మార్గమని, తక్షణ మే న్యాయవిచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి కామేశ్వ రరావు డిమాండ్‌చేశారు.
బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ ఆసరా ఉం టుందని మార్క్‌ఫెడ్ చైర్మన్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. ఆదివారం పూసపాటిరేగ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 22 మందికి రూ.14లక్షల 3వేల చెక్కులను పంపిణీచేశారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, మౌలిక వసతుల కల్పనకు ప్రాధా న్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు ఐక్యంగా పని చేసి, అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని చీపురు పల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు.పని చేసే నాయకుణ్ణి ప్రజలు ఎప్పటికీ విశ్వసిస్తారని తెలిపారు. మెరకముడిదాం మండలంలోని బుదరాయవలస, శ్యామాయవలస, సాతాంవలసకు చెందిన 700 మందికి ఆదివారం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో టీడీపీకండువాలు వేసి ఆహ్వానించారు.
జిల్లాలో పూర్తిస్థాయిలో భూములకు సాగునీరందాలంటే ప్రాజెక్టుల ఆధునికీకరణ ఎంతో అవసరం.
అన్నదాతను వరుణుడి గండం వీడడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.