I gave a complaint. but there was no response. ఏడాది కిందట ఫిర్యాదు చేశాను.. స్పందించలే
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:12 AM
I gave a complaint. but there was no response. తన భూమి సమస్య మీద కలెక్టర్‌కు లెటర్ పెట్టి ఏడాదైందని, చివరిగా నాలుగు నెలల కిందట మరోసారి ఆయన దృష్టిలో పెట్టానని, ఇప్పటికీ స్పందన లేదని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలోని తన బంగ్లాలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో లేనివారు వారికి అనుకూలంగా పనులు చేసుకుంటున్నారని, చట్టాల్ని చుట్టాలుగా చేసుకున్నవారు, అధికార దుర్వినియోగానికి పాల్పడినవారు ఈరోజు మాట్లాడుతున్నారని నిరాశ వ్యక్తం చేశారు. అధికారుల తీరు సరైంది కాదని, తమకు చట్టం మీద నమ్మకం ఉందని, ఆ నమ్మకానికి పరీక్ష పెట్టొద్దని హితవు పలికారు.
ఏడాది కిందట ఫిర్యాదు చేశాను.. స్పందించలే
అసలు ప్రైవేటు స్థలం పభుత్వ స్థలంగా ఎలా మారింది
మీడియా సమావేశంలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు
విజయనగరం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): తన భూమి సమస్య మీద కలెక్టర్‌కు లెటర్ పెట్టి ఏడాదైందని, చివరిగా నాలుగు నెలల కిందట మరోసారి ఆయన దృష్టిలో పెట్టానని, ఇప్పటికీ స్పందన లేదని గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలోని తన బంగ్లాలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో లేనివారు వారికి అనుకూలంగా పనులు చేసుకుంటున్నారని, చట్టాల్ని చుట్టాలుగా చేసుకున్నవారు, అధికార దుర్వినియోగానికి పాల్పడినవారు ఈరోజు మాట్లాడుతున్నారని నిరాశ వ్యక్తం చేశారు. అధికారుల తీరు సరైంది కాదని, తమకు చట్టం మీద నమ్మకం ఉందని, ఆ నమ్మకానికి పరీక్ష పెట్టొద్దని హితవు పలికారు. చట్టానికి విలువ ఇస్తూ ముందుకు వెళ్తామని, తనపై గతంలో చాలా కేసులు పెట్టారని, అందులో నాలుగు తప్పుడు కేసులని కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉండి కూడా వ్యక్తిగత సమస్యపై పత్రికా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు. తనకు టౌన్ సర్వే రికార్డు ప్రకారం విజయనగరం పట్టణంలోని మహారాజుపేట దక్షిణవార్డు సర్వే నెంబరు.569లో 4.76 ఎకరాల విస్తీర్ణంలో వారసత్వ భూమి ఉందని, దీంట్లో ఎకరా భూమిని గత ప్రభుత్వం ఆ పార్టీ కార్యాలయానికి ఇచ్చిందని, అందుకు ఎలాంటి రూల్ ఆఫ్‌లా పాటించలేదని ఆక్షేపించారు. ఆ తప్పును కప్పిపుచ్చేందుకు సమస్యను తప్పుదారి పట్టించేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయడంలేదని, చట్టం ప్రకారమే మాట్లాడుతున్నానని చెప్పారు.
- గత పాలకులు గాని, నాడు వారికి వత్తాసు పలికిన అధికారుల తీరు చూస్తే తమ కుటుంబం గుర్తింపులేని కుటుంబంగా భావిస్తున్నట్లు సందేహం కలుగుతోందని అశోక్ ఎద్దేవా చేశారు. ఏదైనా సమస్య వస్తే చట్టం ప్రకారం నోటీసు ఇవ్వాలని, రికార్డుల ప్రకారం చర్యలు తీసుకోవాలని, కానీ అక్రమ మార్గంలో వెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రభుత్వ స్థలంగా ఎలా మారింది...?
రికార్డుల్లో ప్రైవేటు స్థలంగా ఉండగా ప్రభుత్వ స్థలంగా ఎలా మారిందో నేటికీ తనకు అంతుచిక్కని ప్రశ్నగా మారిందని అశోక్ సందేహం వ్యక్తం చేశారు. అలా మారాలంటే కొన్ని పద్ధతులు, నియమ నిబంధనలు ఉంటాయన్నారు. అవేమీ పాటించలేదని, అలా చేయాల్సి వస్తే కేవలం కలెక్టర్‌కు మాత్రమే ఆ అధికారం ఉందని గుర్తుచేశారు. మోతీ మహల్, అమ్మవారి ఆలయం కూడా తమ భూములేనని, అలాంటి తమ భూములను ప్రభుత్వ స్థలంగా మార్చడం అధికార దుర్వినియోగమేనన్నారు. తమ భూమి అనడానికి అన్ని రికార్డులు ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు నిద్రపోవడం సరికాదని, తమకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, గవర్నర్ అయ్యే ముందు రాజకీయ పార్టీకి రాజీనామా చేశానని, ఇప్పుడు ఆస్తులను కాపాడుకోవడం కోసం రాజీనామా చేయాలా..? అని ప్రశ్నించారు. పురపాలక ఆస్తుల రక్షణకు బాధ్యులు ఎవరని కలెక్టర్‌ను అడిగానని, భూరక్షణ చట్టం ఆధారంగా తన భూమికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో కారణం లేకుండా తన మీద క్రిమినల్ కేసులు వేశారని, మూడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పైడితల్లి అమ్మవారే కాపాడారని, లేకపోతే జైలులో వేసేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యాలయానికి స్థలాన్ని ఏవిధంగా కేటాయించారో తేదీల వారీగా ఆధారాలున్నాయని చూపించారు. చట్టాలను చుట్టాలుగా చేసి తన స్థలాన్ని కొట్టేశారని, రికార్డులు పరిశీలించి, తన భూమి విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నానని అశోక్ వివరించారు.