Ministers to visit Model School today నేడు మోడల్ స్కూల్‌కు మంత్రుల రాక
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:16 AM
Ministers to visit Model School today భోగాపురం పీఎంశ్రీ ఏపీ మోడల్‌స్కూల్‌ను మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సందర్శించనున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటన ఉండడంతో కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి సోమవారం స్కూల్‌ని సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నేడు మోడల్ స్కూల్‌కు మంత్రుల రాక
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి
భోగాపురం, జూన్ 29(ఆంధ్రజ్యోతి): భోగాపురం పీఎంశ్రీ ఏపీ మోడల్‌స్కూల్‌ను మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సందర్శించనున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటన ఉండడంతో కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి సోమవారం స్కూల్‌ని సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని తరగతి గదులు, ల్యాబ్, వసతి గృహం, క్రీడా ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు. కొన్ని గదుల్లో విద్యుత్ వైర్లు బయటకు వేలాడుతూ ఉండడం గుర్తించి వెంటనే సరిచేయాలన్నారు. మంత్రుల పర్యటన ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. కలెక్టర్ వెంట సమగ్రశిక్ష ఎస్‌పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్, మోడల్ స్కూల్స్ జేఏడీ సుల్తానా, జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యంనాయుడు, ఆర్డీవో సుధాసాగర్, ఎంపీడీవో డీడీ స్వరూపరాణి, టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
మోడల్ స్కూలుకు ముస్తాబు
కేంద్ర, రాష్ట్ర మంత్రులు వస్తుండడంతో పాఠశాలను అందంగా ముస్తాబు చేశారు. ముందుభాగంలో రడీమేడ్ ప్రహరీ ఏర్పాటు చేశారు. అలాగే క్రీడా ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అన్ని తరగతి గదులు, లాబ్‌లు, ఆర్‌ఓ ప్లాంటును కూడా అలంకరించారు. హాస్టల్ గోడలకు రంగులు వేశారు. మంత్రుల రాకతోనైనా మోడల్ స్కూల్ బాగుపడిందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.