Share News

Single Death ఏ ఒక్కరూ మరణించకూడదు

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:55 PM

Not a Single Death Should Occur జ్వరాలతో జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించరాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

 Single Death   ఏ ఒక్కరూ మరణించకూడదు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సంధ్యారాణి

  • వసతిగృహాల పిల్లలకు రెగ్యులర్‌గా వైద్యసేవలు అందించండి

  • పీహెచ్‌సీల నుంచి అనవసరంగా రెఫరల్‌ చేయవద్దు

పార్వతీపురం, జూన్‌29(ఆంధ్రజ్యోతి): జ్వరాలతో జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించరాదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, తదితర వాటిపై ఆరా తీశారు. వారానికి ఒకసారి వైద్యులు, రెండుసార్లు స్టాఫ్‌ నర్సులు తప్పనిసరిగా వసతిగృహాలకు వెళ్లాలన్నారు. అక్కడున్న పిల్లల ఆరోగ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గిరిజన గర్భిణుల వసతిగృహాలకు బదులు ప్రభుత్వం బర్త్‌ వెయింటింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో శతశాతం సాధారణ ప్రసవాలు జరగాలని ఆదేశించారు. పీహెచ్‌సీల నుంచి అనవసరంగా రోగులను రెఫరల్‌ చేయరాదన్నారు. జిల్లాలో వైద్య సిబ్బంది టూర్‌ షెడ్యూల్‌ను తెలియజేస్తే.. తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా పరిశీలిస్తారని వెల్లడించారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భద్రగిరి, కురుపాం ఆసుపత్రుల భవనాల పూర్తికి తేదీలు ఖరారుచేయాలన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో దుడ్డుకళ్లు, తాడికొండ పీహెచ్‌సీ వైద్యుల ఫిర్యాదులు వస్తున్నాయని ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి తెలిపారు. అంబులెన్స్‌లు సకాలంలో చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. దోనుబాయి తదిరత ప్రాంతాల్లో మలే రియా నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ డీఎంవోను ప్రశ్నించారు. ఐటీడీ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి , డీఎంహెచ్‌వో భాస్కరరావు, ఐటీడీఏ పీవో వైశాలి, ఆర్డీవో మాధురి, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 11:55 PM