పశువుల పెంపకందారులకు నోటీసులు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:22 AM
పట్టణంలో పశుసంచారంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పెంపకందారులకు నోటీసులు జారీచేయాలని బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు.
బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి
బొబ్బిలి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో పశుసంచారంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో పెంపకందారులకు నోటీసులు జారీచేయాలని బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి ఆదేశించారు. సోమవారం ముని సిపాలిటీలోని అగ్రహారంవీధి, గాయత్రికాలేజీ రోడ్డు, జూబ్లీరోడ్డు ప్రాంతాల్లో పర్యటిం చారు. ఈసందర్భంగా పలు వీధుల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో దోమలు, విషపురు గుల బెడద ఎక్కువగా ఉంటోందని స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పిచ్చిమొక్కలు, చెత్త వెంటనే తొలగించాలని, ఆయా ప్రాంతాల్లో చెత్త వేయరాదని హెచ్చరిస్తూ బోర్డులను ఏర్పాటుచేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. జూబ్లీ రోడ్డులో పశువుల పెంపకందారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. కార్య క్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్ మురళి, పబ్లిక్ హెల్త్ మేస్ర్తీలు, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలు పాల్గొన్నారు.