చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:20 AM
సీతానగరం మండలంలోని జోగింపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎరుకునాయుడు చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బత్తిన మోహన్‌రావు, టి.గౌరీ శంకరరావు, రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నాయకుల డిమాండ్
బెలగాం/పార్వతీపురం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): సీతానగరం మండలంలోని జోగింపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల ఎరుకునాయుడు చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు బత్తిన మోహన్‌రావు, టి.గౌరీ శంకరరావు, రంజిత్‌కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగాన భాస్కరరావు, తిల్లా గౌరీశంకరరావు, పాలక రంజిత్‌కుమార్, జోగంపేట రైతులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ జోగం పేట రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 24లో ఉన్న ఎరుకునాయుడు చెరువు తొమ్మిది ఎకరాల 50 సెంట్లు ఆక్రమణకు గురైందని తెలిపారు. ఆక్రమణ దారులు చెరువు గర్భాల్లో నీలగిరి, జీడి, ఇతర మొక్కల పెంపకం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.