బొబ్బిలిలో యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:21 AM
బొబ్బిలిలోని స్వామి వారి వీధిలో గల పోస్టాఫీసు సమీపంలోని గ్రూపు హౌస్‌లో ఆలవెల్లి వెంకటరావు (31) సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసున్నాడు.
బొబ్బిలి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలోని స్వామి వారి వీధిలో గల పోస్టాఫీసు సమీపంలోని గ్రూపు హౌస్‌లో ఆలవెల్లి వెంకటరావు (31) సోమవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసున్నాడు. వెంకటరావు సాలూరులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎంఎన్‌వోగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని ఇంటికొచ్చిన తర్వాత ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఆయనకు మానసతో 12 ఏళ్ల కిందట జరిగింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఎస్‌ఐ శ్రీరాములు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యుల నుంచి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఏడాది కిందట ఇందిరమ్మ కాలనీ నుంచి స్వామివారి వీధి వచ్చి నివాసముంటున్నాడు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియరావాల్సి ఉంది.