Joining hands... securing irrigation water : సాగునీటి కాల్వపై చెక్‌డ్యాం నిర్మించి తమ చెరువుకు నీళ్లు ఇవ్వాలని ఇద్దనవలస రైతులు ఏళ్ల తరబడి కోరుతూ వచ్చారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. వెళ్లిన ప్రతిసారీ అర్జీలు అందజేశారు. ఏటా పంటలు నష్టపోవడంతోపాటు తాగునీటి సమస్య వెంటాడడంతో విసిగిపోయారు.
“Baby kits are on the way!” ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వారికి బేబీ కిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఇటీవల ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Rajam ranks first in ‘Swachh Andhra... Swarna Andhra’ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం అమలులో రాజాం మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రథమ స్థానం లభించింది. 50వేల లోపు జనాభా కలిగి ఉన్న మున్సిపాలిటీల విభాగంలో స్వచ్ఛ మున్సిపాలిటీస్ కేటగిరీలో మొదటిస్థానాన్ని కైవశం చేసుకుంది.
Expediting Case Investigations పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ మాధవరెడ్డి ఆదేశించారు. బుధవారం బలిజిపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు.
Will there be a yield? వేపాడ మండలం బొద్దాం శివారు కొత్తబొద్దాంకు చెందిన రైతు దేముడుకు రెండు ఎకరాల పొలం ఉంది. జూలై నుంచి ఆగస్టు మధ్యలో అడపాదడపా పడిన చినుకులకు పొలంలో చేరిన నీరు సరిపోక సమీపంలో ఉన్న చెరువు నుంచి ఇంజన్ ద్వారా నీళ్లు తోడి ఓ ఎకరంలో ఉబాలు పూర్తిచేశాడు.
Old age is not for the mind. వారంతా వయసుకే వృద్ధులు.. మనసులో మాత్రం యుక్త వయస్కులు కూడా సరిపోరు. జీవితాన్ని ఆస్వాదించాలని.. సర్దుకుపోతూ ముందుకెళ్లాలని.. ఉన్నదాంతో అనందపడాలని.. తృప్తిగా వీడ్కోలు పలకాలని చెబుతుంటే విన్నవారంతా నిశ్చేష్టులవుతున్నారు. రాజాం వృద్ధాశ్రమంలో ఉన్న వారే కాకుండా అనేక మంది ఇళ్ల వద్ద ఉండే వృద్ధులు కూడా యువతతో పోటీ పడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.
గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.
పల్లెల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు.
హౌస్‌హోల్డ్ సర్వేలో నమోదైన వివరాల్లో లోపాల ను సరిచేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశిం చారు.