ఫీజు రీయింబర్స్‌మెంటు విడుదలపై హర్షం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:18 AM
ఫీజు రీయింబర్స్‌మెంటుని విడుదల చేయడం పట్ల టీఎన్‌ఎస్‌ఎఫ్ హర్షం వ్యక్తం చేసింది.
విజయనగరం రూరల్, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంటుని విడుదల చేయడం పట్ల టీఎన్‌ఎస్‌ఎఫ్ హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలోని అశోక్ బంగ్లాలో నారా లోకేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈసందర్భంగా టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకు డు బెవర భరత్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పొగిరి పైడిరాజులు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. టీడీపీ అధికారం లోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తూ వచ్చిందన్నారు. తాజాగా రూ.1,200 కోట్లను ప్ర భుత్వం విడుదల చేసిందన్నారు. విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు నారా లోకేశ్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్ ఎఫ్, తెలుగు యువత నాయకులు కాళ్ల గౌరీ, గేదేల సతీష్, పీకేఎల్ రాజు, కిలాన వెంకటేష్, రాయపాటి సంతోష్, విజయ్, కోండ్రు సాయి, పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు.