ఆర్టీసీ కండక్టర్లకు పవర్ బ్యాంకులు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:21 AM
ఆర్టీసీ కండక్టర్లకు పవర్ బ్యాంకులను మన్యం జిల్లా ప్రజా రవాణాధికారి కె.శ్రీనివాసరావు అందజేశారు.
సాలూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కండక్టర్లకు పవర్ బ్యాంకులను మన్యం జిల్లా ప్రజా రవాణాధికారి కె.శ్రీనివాసరావు అందజేశారు. శుక్రవారం సాలూరు డిపోను ఆయన సందర్శించారు. టిమ్ ఛార్జింగ్ సమస్యలు తలెత్తకుండా 20 వేలు ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న పవర్ బ్యాంకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ప్రజల్లో చాలా ఆదరణ పొందుతోందన్నారు. టిమ్ చార్జింగ్ తక్కువ కాకుండా ఉండడానికి బస్సు ట్రాకింగ్ సిస్టం తెలియడానికి పవర్ బ్యాంకులను అందించామన్నారు. అలాగే ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సాలూరు పారకొండ జాతర పార్కింగ్ ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. పారమ్మకొండ జాతర సందర్భంగా ఏడాది 30 బస్సులను తిప్పుతామన్నారు. ఆయన వెంట డిపో మేనేజర్ పి.ఆచారి, సూపరింటెండెంట్ మెకానికల్ ఎంవీఎస్ రాజు పాల్గొన్నారు.