థాంక్యూ సీఎం సార్
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:20 AM
ఎన్నో ఏళ్లుగా 108 వాహనం ద్వారా పనిచేస్తున్న తమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీతాలు పెంచడంపై ఈఎంటీ, పైలేట్‌లు హర్షం వ్యక్తంచేశారు.
శృంగవరపుకోట, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా 108 వాహనం ద్వారా పనిచేస్తున్న తమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీతాలు పెంచడంపై ఈఎంటీ, పైలేట్‌లు హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం ఎస్.కోటలోని 108 వాహనం ముందు థాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
భోగాపురం, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో 108 సిబ్బంది థాంక్యూ సీఎం సార్, థెంక్యూ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు.