Share News

Still Lying Vacant కోట్లు వెచ్చించినా .. ఇంకా ఖాళీగానే..

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:19 AM

Despite Spending Crores… Still Lying Vacant గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల కోట్లాది రుపాయల నిధులు వృథా అయ్యాయి. జగనన్న కాలనీల పేరిట గ్రామాలు, పట్టణాలకు దూరంగా.. నిర్మాణాలకు అనువుగా లేని స్థలాలను అప్పట్లో పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశారు.

 Still Lying Vacant కోట్లు వెచ్చించినా .. ఇంకా ఖాళీగానే..
భామిని మండలం పసుకుడిలో జగనన్న లే అవుట్‌ ఇలా..

  • అధ్వానంగా జగనన్న లేఅవుట్లు

  • మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపని వైసీపీ సర్కారు

  • సొంతింటి కలను నెరవేర్చుకోలేని స్థితిలో పేదలు

పార్వతీపురం, ఫిబ్రవరి13(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల కోట్లాది రుపాయల నిధులు వృథా అయ్యాయి. జగనన్న కాలనీల పేరిట గ్రామాలు, పట్టణాలకు దూరంగా.. నిర్మాణాలకు అనువుగా లేని స్థలాలను అప్పట్లో పెద్ద మొత్తంలో చెల్లించి కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున నగదు చేతులు మారిందనే ఆరోపణలున్నాయి. కాగా ఆయా లేఅవుట్లలో మౌలిక వసతులేవీ కల్పించకపోవడంతో లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముం దుకు రాలేదు. దీంతో నేటికీ ఆయా స్థలాలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. మొత్తంగా పేదల సొంతింటి కలను నెరవేర్చలేకపోయారు.

ఇదీ పరిస్థితి

- పార్వతీపురం డివిజన్‌లో 53 ఎకరాల 76 సెంట్లను 85 మంది భూ యజమానులు నుంచి అప్పట్లో కొనుగోలు చేశారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.3.32కోట్లు, పార్వతీపురం, సాలూరు పట్టణ ప్రాంతాల ప్రజలు రూ.7.05 కోట్లు వెచ్చించారు. ఇది కాకుండా 165 మంది నుంచి సుమారు 112 ఎకరాల 38 సెంట్ల డీపట్టా భూములును కొనుగోలు చేశారు. ఇందుకోసం రూ.2.63 కోట్లు చెల్లించారు.

- పార్వతీపురం మండలం నర్సిపురం, పెదమరికి పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిన భూములను ప్లాట్లుగా విభజించి.. అప్పట్లో లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. అయితే ఆయా స్థలాలు నిర్మాణాలకు అనుకూలంగా లేకపోవంతో ఇళ్లు కట్టుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం తూరుమామిడి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడి పేదలకు కేటాయించిన స్థలాలు నేటికీ ఖాళీగానే ఉన్నాయి. పాలకొండ డివిజన్‌లో వీరఘట్టం, భామిని, పాలకొండ మండలాల్లోని జగనన్న కాలనీల్లోనూ ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణం జరగలేదు.

- జిల్లాలోని జగన్న కాలనీల్లో 381 లేఅవుట్లు వేయగా.. అందులో 5092 మంది కూడా పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించుకోలేకపోయారు.

Updated Date - Feb 14 , 2026 | 12:19 AM