జీవనాధారం లేకుండా చేయొద్దు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:17 AM
తమకు జీవనాధార మైన భూములను ఇచ్చేది లేదని ముంజేరు గ్రామంలోని రైతు లు శుక్రవారం భారీఎత్తున నిరసన చేపట్టారు.
భోగాపురం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): తమకు జీవనాధార మైన భూములను ఇచ్చేది లేదని ముంజేరు గ్రామంలోని రైతు లు శుక్రవారం భారీఎత్తున నిరసన చేపట్టారు. ఐటీ పార్కుల కోసం తమ భూములు తీసుకుంటే ఎలా బతకగలమని ప్రశ్నించించారు. తమ భూములు తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ఈ కార్యక్రమం లో సుమారు 300 మంది రైతులు పాల్గొన్నారు.