తెలుగు భాషపై మక్కువ పెంపొందించండి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:19 AM
విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా, వారిలో తెలుగుపై మక్కువ పెంచేలా సృజనాత్మకతను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి అన్నారు.
బెలగాం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా, వారిలో తెలుగుపై మక్కువ పెంచేలా సృజనాత్మకతను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అని కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక మన్యం కళావేదికలో శక్రవారం నిర్వహించిన జల్లా స్థాయి తెలుగు వర్క్ షాప్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు అత్యంత ఇష్టమైన సబ్జెక్టుగా విద్యార్థులకు మారాలన్నారు. కథలు, పాటలు రూపంలో తెలుగు ఉన్న మాధుర్యాన్ని విద్యార్థులు ఆస్వాదించేలా చేయాలని దిశా నిర్దేశం చేశారు. భాష దిశను మార్చగలిగేది ఉపాధ్యాయులేనని, అత్యంత సంతృప్తినిచ్చే వృత్తి ఉపాధ్యాయ వృత్తిని వివరించారు. ప్రతి గురువారం విద్యార్థులు ఒక కవిత గానీ, కఽథ గానీ రాసి ఇచ్చేలా ఉపాధ్యాయులు విద్యా ర్థులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైశాలి, విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు బి.విజయ భాస్కర్, డీఈవో బ్రహ్మాజీరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అప్పన్న, ప్రముఖ కవి గంటేడ గౌరునాయుడు, పక్కి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.