only case registration కొత్తవలస పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే బాధితులు వెనకడుగు వేస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చి స్టేషన్ చుట్టూ తిరిగే కంటే ఊరుకోవడమే మేలని భావిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చిన దొంగతనం కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో ఒక్క కేసులో కూడా రికవరీ లేదని సమాచారం. నిందితులను పట్టుకున్నదీ లేదు. బాధితులు తిరిగి తిరిగి నిరాశకు గురవుతున్నారు.
Leave This Place ఏవోబీ సరిహద్దు ప్రాంతం కొఠియాలో మరోసారి ఒడిశా అధికారులు రెచ్చిపోయారు. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు.
cotton crap పత్తి పంట చేతికి అందడానికి రేయింబవళ్లూ కష్టించిన రైతులు చివరకు మద్దతు ధర దక్కించు కోలేకపోతున్నారు. సమీపంలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దూరంగా ఉన్న రాజాం, రామభద్రపురం తరలించలేకపోతున్నారు.
Striving for Goal Achievement సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి విద్యార్థులు విద్యతో పాటు లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆర్జేడీ విజయభాస్కర్ సూచించారు. మంగళవారం భామినిలో ఆదర్శపాఠశాల, కేజీబీవీని సందర్శించారు. వాటి నిర్వహణపై ఆరా తీశారు.
water problem ఆ పాఠశాల విద్యార్థులు భోజన సమయంలో గుక్కెడు తాగునీటికి నోచుకోవడం లేదు. దీంతో గొంతు తడవక.. ముద్ద దిగక ఇబ్బంది పడుతున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. చేసేదిలేక అరకొర అన్నంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ గంట్యాడ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో పరిస్థితి.
The Unstoppable Sand Mafia జిల్లాలో ఇసుక దందా ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మాదిరిగానే ఇప్పుడు కూడా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలించుకుపోతున్నారు. ముఖ్యంగా కొమరాడ, పాలకొండ మండలాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివెనుక కొందరు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Swallowed by the Canal! కొమరాడ మండలంలో జంఝావతి ఘటన మరువకముందే గరుగుబిల్లిలో మరో విషాదం చోటుచేసుకుంది. స్నానానికని నాగావళి ఎడమ కాలువలో దిగి ప్రమాదవశాత్తూ ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు.
A Sea of Tears..! ఆశలు గల్లంతయ్యాయి.. చివరకు కన్నీళ్లే మిగిలాయి. జంఝావతి రబ్బరు డ్యామ్‌లో ఆదివారం స్నానానికని దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతి చెందారు. సోమవారం విగతజీవులుగా కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు.
Probe Into Irregularities in ITDA సీతంపేట ఐటీడీఏలో ముగ్గురు అధికారుల అవినీతి, అక్రమాలపై విచారణకు రంగం సిద్ధమైంది. ఐటీడీఏ పరిధిలో జరిగిన అక్రమాలపై దళిత సంఘాల జేఏసీ ఫిర్యాదు మేరకు ఈ నెల 26న విచారణ చేపట్టాలని గిరిజన సంక్షేమ డైరెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ట్రైకార్ ఎండీ సీఏ మణికుమార్‌ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Farmer Welfare Is Our Prime Goal రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ‘రైతన్నా... మీ కోసం’ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ రైతన్నా...మీ కోసం’ పై విస్త్రత ప్రచారం చేయాలన్నారు.