Share News

నిర్వాసితుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:16 AM

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూ నిర్వాసితుల సమస్యల ను దశలవారీగా పరిష్కరిస్తా మని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు అన్నారు.

నిర్వాసితుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాం

  • రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బంగార్రాజు

భోగాపురం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూ నిర్వాసితుల సమస్యల ను దశలవారీగా పరిష్కరిస్తా మని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు అన్నారు. మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం లో బైరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బైరెడ్డి అప్పలనర్శ య్య, సత్తయ్యమ్మ, సూర్యలక్ష్మిలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి పట్టాలను తహసీల్దార్‌ జి.హేమంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆయన అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్‌పోర్టు భూ నిర్వాసితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:16 AM