Share News

ఏకాగ్రతకు యోగా దోహదం

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:59 AM

యోగా శారీరక, మానసిక ఉల్లాసానికి, ఏకాగ్రతకు దోహదపడుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

ఏకాగ్రతకు యోగా దోహదం
యోగా విజేతలతో మంత్రి సంధ్యారాణి

సాలూరు, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): యోగా శారీరక, మానసిక ఉల్లాసానికి, ఏకాగ్రతకు దోహదపడుతుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం సాలూరులో క్యాంప్‌ కార్యాల యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా స్థాయి యోగా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను ఆమె అభినందిం చారు. ఈ సందర్భంగా వారికి సర్టిఫికెట్లు, జ్ఞాపికలను ఆమె అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు యోగాలో రాణించడం అభినంద నీయమన్నారు. జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి సాలూరు కీర్తిని పెంచిన విద్యార్థులు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.టి.రత్నకుమార్‌, మున్సిపల్‌ డీఈ, యోగా మాస్టర్‌ నాయుడు, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:59 AM